Political News

బీజేపీకి కష్టమేనా ?

తొందరలో ఉత్తరప్రదేశ్ లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి పెద్ద పరీక్షగా మారబోతున్నాయా ? అవుననే అనిపిస్తోంది క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే. ఒకవైపు పెద్దపార్టీలు, మరోవైపు చిన్న పార్టీలు కమలంపార్టీకి సవాలు విసురుతున్నాయి. పెద్దపార్టీల్లో ఎస్పీ, బీఎస్పీ యూపిలో బలమైన ప్రాంతీయ పార్టీలన్న విషయం అందరికీ తెలిసిందే.

పై రెండు పార్టీలు కాకుండా జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఇవికాకుండా చిన్నా చితకా పార్టీలు చాలానే ఉన్నాయి. వీటిలో చెప్పుకోదగ్గవి ఓ మూడున్నాయి. చిన్నవే కదాని తీసిపారేసేందుకు లేదు వీటిని. ఎందుకంటే యూపీలోని కొన్ని ప్రాంతాల్లో గట్టి ప్రభావం చూపగలవన్న విషయం గతంలోనే రుజువయ్యాయి.

ఇలాంటి పార్టీల్లో ఆజాద్ సమాజ్ పార్టీ ఒకటి. బీమ్ ఆర్మీ పేరుతో చెలామణి అవుతున్న పార్టీ ఎస్సీలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. దీని వ్యవస్ధాపక అధ్యక్షుడు చంద్రశేఖర్ కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 21వ తేదీవరకు సైకిల్ యాత్ర చేస్తారు. ఈ పార్టీకి ఎస్సీల్లో మంచి పట్టుంది. రాబోయే ఎన్నికల్లో బీమ్ పార్టీ దెబ్బ ఎవరికి తగులుతుందో అర్ధం కావటంలేదు. ఇప్పటివరకు బీహార్ కు మాత్రమే పరిమితమైన వికాస్ ఇన్సాస్ పార్టీ (వీఐపీ) యూపిలో పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది.

దీని అధ్యక్షుడు ముఖేష్ సాహ్ని రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. నిషాద్ లను ఏకం చేయటమే లక్ష్యంగా ఈయన పర్యటనలుంటున్నాయి. యూపిలో 14 శాతం నిషాద్ జనాభా ఉంది. తమకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని సాహ్నీ డిమాండ్ చేస్తున్నారు. 70 నియోజకవర్గాల్లో నిషాద్ కు బలమైన ఓటుబ్యాంకుంది. అందుకనే 150 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను రెడీ చేస్తున్నారు. బందిపోటు రాణి పూలన్ దేవి నిషాద్ కు ఒకపుడు పెద్ద దిక్కు.

ఇక ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) కూడా రంగంలోకి దూకుతోంది. యూపీకి ఆనుకునే ఢిల్లీ ఉండటం ఆప్ కు బాగా కలిసివచ్చే అవకాశం. ఎలాగంటే ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ కు క్లీన్ చిట్ ఉంది. మూడోసారి సీఎం అయిన కేజ్రీవాల్ పరిపాలన ఎలాగుందో యూపీ జనాలకు బాగా తెలిసే ఉంటుంది. ఎన్నికల్లో గెలవటం ద్వారా నిర్ణయాత్మక పాత్రను పోషించాలని ఆప్ డిసైడ్ అయ్యింది. తాజాగా జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించినట్లు కాదు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటం. ఎందుకంటే కమలంపార్టీని పెద్దా చిన్న పార్టీలు అన్నీవైపుల నుండి కమ్ముకుంటున్నాయి.

This post was last modified on July 6, 2021 9:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

27 minutes ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

1 hour ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

2 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

4 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

6 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

7 hours ago