అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పాపులరైన ఎంఎల్ఏ రోజా చాలా కాలం తర్వాత మీడియా ముందుకొచ్చారు. రావటం రావటమే ఒకేసారి ఇటు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుతో పాటు తెలంగాణా ప్రభుత్వంపై ఫుల్లుగా ఫైరయ్యారు. మంగరళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు చేసిన దీక్షపై రోజా మండిపోయారు. దొంగ దీక్షలు చేయటం వల్ల చంద్రబాబు జనాల్లో పలుచనైపోయారంటు సెటైర్లు వేశారు.
ఇక తెలంగాణా-ఏపి మధ్య జరుగుతున్న జల వివాదంపైన కూడా రోజా ఫైర్ అయ్యారు. తెలంగాణా మంత్రులను తప్పుపట్టారు. వైఎస్సార్ ను ఏమన్నా అంటే ఊరుకునేది లేదంటు మంత్రులకు గట్టి వార్నింగే ఇచ్చారు. ప్రాజెక్టుల నుండి అక్రమంగా నీటిని వాడేస్తు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవటం తగదన్నారు. రోజా తెలంగాణ మంత్రులకు వార్నింగ్ ఇవ్వటం మాట అటుంచుందాం.
దివంగత సీఎం వైఎస్సార్ గురించి తెలంగాణా మంత్రులు చేసిన వ్యాఖ్యలకు మద్దతిచ్చేట్లుగా వైఎస్ షర్మిల కూడా మాట్లాడారు కదా. మరి షర్మిల గురించి రోజా ఏమి మాట్లాడకపొవటం బాగోలేదు. మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన రోజా షర్మిల గురించి కూడా ఏదైనా మాట్లాడుంటే బాగుండేది. వైఎస్ కూతురు షర్మిలే నీటి వాడకం విషయంలో ఏపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పిన తర్వాత ఇక రోజా మాట్లాడేందుకు ఏముంటుంది ?
అయినా జల వివాదాల గురించి రోజా మాట్లాడటం అనవసరమే. ఎందుకంటే ప్రస్తుత వివాదంపై జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు లేఖలు రాశారు. నీటి పారుదల శాఖ మంత్రి అనీల్ కుమార్ మాట్లాడుతున్నారు. వీరికి అవసరమైన సమాచారం ఇవ్వటానికి ఉన్నతాధికారులు ఎలాగూఉన్నారు. ఇక రోజా వార్నింగులు, విజ్ఞప్తులతో పనేముంది ?
This post was last modified on July 3, 2021 11:22 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…