అత్యంత కీలకమైన.. గుంటూరు జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి మేడిపండేనా ? .. ఇక్కడ బలపడ్డాం.. ఇంకేముంది.. టీడీపీ కూసాలు కదిలిపోవడం ఖాయం అని.. వైసీపీ నేతలు భావిస్తే.. భావించి ఉండొచ్చు. కానీ, వాస్తవ పరిస్థితిని గమనిస్తే.. మాత్రం దీనికి భిన్నంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. గుంటూరు జిల్లాలో టీడీపీకి మద్దతుదారులు ఎక్కువ. ఇక్కడ నేతలు చాలా మంది వరుసగా విజయాలు సాధించారు. దీంతో .. టీడీపీకి 2014లో ఎక్కవ సీట్లు లభించాయి. అదే సమయంలో రెండు ఎంపీ స్థానాలు కూడా టీడీపీ ఖాతాలో పడ్డాయి. అయితే.. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ దూకుడు ప్రదర్శించింది.
ఈ క్రమంలో ఒక ఎంపీ స్థానం సహా.. ఎమ్మెల్యేలను గెలుచుకుంది. నిజానికి ఒక రకంగా.. గుంటూరులో వైసీపీ ఇంత రేంజ్‌లో విజయం దక్కించుకోవడం.. రికార్డనే చెప్పాలి. ఎందుకంటే.. టీడీపీ హయాంలో గుంటూరులోని అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఇక్కడ వంద అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే సమయంలో పెద్ద ఎత్తున రహదారులను కూడా నిర్మించారు. పైగా ఇక్కడ కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యం ఎక్కువ. ఇక రాజధాని రియల్ భూమ్ హవాలో ఇక్కడ సామాన్యులు సైతం కుబేరులు అయ్యారు. దీంతో టీడీపీకి మరింత మద్దతు చేకూరి జిల్లా జిల్లా మొత్తం.. కంచుకోటగా మారుతుందని లెక్కలు వేసుకున్నారు. కానీ, అనూహ్యంగా ఇక్కడ వైసీపీ పుంజుకుంది.
దీంతో ఇంకేముంది.. టీడీపీకి ఏమీలేదు.. అంతా మాదే.. అంతా మేమే.. అనే తరహాలో వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. దీంతో నిజంగానే వైసీపీ బలపడిందా? ఇది బలమేనా ? అనే చర్చ సాగుతోంది. అయితే, గడిచిన రెండేళ్లలో ఇక్కడ చేసిన అభివృద్ధి అంటూ లేకపోగా.. నేతలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఒకరిపై ఒకరు ఎంపీ, ఎమ్మెల్యేలు వీధి పోరాటాలకు దిగారు. దీంతో ప్రజాప్రతినిధులు అంటే.. ఉండే విలువను చేజేతులా నాశనం చేసుకున్నట్టయిందని అంటున్నారు పరిశీలకులు.
ఇక, అత్యంత కీలకమైన.. అమరావతి తరలింపు విషయంపై ఇక్కడి ప్రజలు మరింత ఆగ్రహంతో ఉన్నారు. సో.. ఇవన్నీ పరిశీలిస్తే.. ఓ రెండు మూడు నియోజకవర్గాలు.. మినహా.. ఎక్కడా వైసీపీకి సానుభూతి లభించడం లేదు. దీనిని బట్టి వైసీపీది బలుపో.. వాపో అర్ధమవుతుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 3, 2021 7:44 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…