తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల కేబినెట్ కోసం ముహూర్తం పెట్టేసినట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ఒక్కటే వార్తలు గుప్పుమంటున్నాయి. కేసీఆర్ కేబినెట్లో కేసీఆర్ కాకుండా ప్రస్తుతం 17 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఈటల రాజేందర్‌ను భర్తరఫ్ చేశారు. ఇప్పటికే కేసీఆర్ రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు.
చివరి ఆరు నెలలు వదిలేస్తే మరో రెండేళ్ల పాలన మాత్రమే ఉంటుంది. ఈ సారి కేబినెట్ ఎన్నికల కేబినెట్ అవుతుంది. మరో ట్విస్ట్ ఏంటంటే కేసీఆర్ అప్పటి వరకు ఉండరని.. గత అసెంబ్లీని 9 నెలల ముందుగానే రద్దు చేసి ఎలా అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లారో ఇప్పుడు కూడా అదే చేస్తారని అంటున్నారు. అదే జరిగితే ఈ సారి ఎన్నికల కేబినెట్‌కు గట్టిగా రెండు సంవత్సరాల టైం కూడా ఉండదు.
ఈ సారి కేసీఆర్ తన కేబినెట్లో భారీ మార్పులు, చేర్పులు చేస్తారని తెలుస్తోంది. సమర్థులు అయిన నేతలకే పెద్ద పీఠ వేస్తారని అంటున్నారు. ఆగస్టులో కేసీఆర్ కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది. ఆగస్టు శ్రావణ మాసం కావడంతో అది కలిసొస్తుందని… ఇప్పటికే పండితులతో చర్చించినట్టు సమాచారం.
ఈటల రాజేందర్ స్థానంలో ఎలాగూ కొత్త మంత్రిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈటల ప్లేస్‌ను భర్తీ చేయడంతో పాటు పనితీరు ఏ మాత్రం సరిగా లేదని భావిస్తోన్న మరో ముగ్గురు మంత్రులు అయితే ఖచ్చితంగా కేబినెట్ నుంచి బయటకు వెళ్లిపోతారనే అంటున్నారు.
ఈ లిస్టులో గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన ఓ మంత్రితో పాటు ఉత్తర తెలంగాణకు చెందిన మరో మంత్రి, దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రి పేరు వినిపిస్తోంది. గ్రేటర్‌కు చెందిన మంత్రి తీరుపై ఇప్పటికే లెక్కలేనన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి.
అలాగే ఉత్తర తెలంగాణలో గత ఎన్నికల్లో సీఎం కుమార్తె కవిత ఓటమికి కారణమయ్యారని ఓ మంత్రి పై సైతం కేసీఆర్, కవిత గుర్రుగా ఉన్నారట. ఏదేమైనా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మంత్రుల మెడపై వేటు కత్తి వేలాడుతోంది. మరి వీరిలో ఎవరిని ఉంచుతారో ? ఎవరిని తీసేస్తారో ? తెలియదు. కొత్తగా గుత్తా సుఖేందర్ రెడ్డి కేబినెట్లోకి రావడం దాదాపు ఖాయమే..!
This post was last modified on July 7, 2021 2:56 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…