కడియం శ్రీహరి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు. తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎంగా కూడా వ్యవహరించారు. అయితే.. ఇప్పుడు ఏంటి? ఆయన ఫ్యూచర్ ఎటు మలుపు తిరుగుతుంది? కేసీఆర్ తీసుకునే నిర్ణయమే కడియం విషయం లో కీలకం కానుందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. టీడీపీతో రాజకీయాలు ప్రారంభించిన కడియం శ్రీహరి.. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి పలు మార్లు విజయం దక్కించుకున్నారు. అదే సమయంలో ఎంపీగా కూడా చక్రం తిప్పారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా వ్యవహరించారు.
అన్నగారు ఎన్టీఆర్, ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హయాంలలో మంత్రిగా కూడా కడియం వ్యవహరించారు. వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన కడియం.. టీడీపీలో ఒక కీలక నేతగా.. మారారు. అయితే.. రాష్ట్ర విభజన సమయంలో టీడీపీతో విభేదించిన ఆయన.. 2013లో టీఆర్ ఎస్ గూటికి చేరిపోయారు. 2015 నాటికి ఎంపీగా ఉన్న కడియంను కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకుని.. ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎం పదవికి ప్రమోట్ చేశారు. మంచి వాయిస్.. సహా తెలంగాణ రాష్ట్రసమితి తరఫున ప్రజలను ఆకట్టుకున్న తీరు .. అప్పట్లో కేసీఆర్ కడియం వైపు ఆకర్షితులయ్యేలా చేశాయని అంటారు.
కానీ, 2018 ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న కడియంకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. పార్టీ మేనిఫెస్టో కమిటీలో కీలక రోల్ ఇచ్చారు. ఇక, ఆ తర్వాత రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చినా.. కడియం వైపు చూడలేదు. కొన్నిసార్లు అప్పాయింట్‌మెంట్ నిరాకరించారనే వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి మౌనంగా ఉంటున్న కడియం.. ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చారు. దీనికి ప్రధాన కారణం.. ఈ నెల 2న ఆయన ఎమ్మెల్సీ పదవి గడువు తీరిపోయింది. ఇప్పుడు ఆయన సాధారణ నాయకుడిగా మిగిలారు. ఈ క్రమంలో మళ్లీ కేసీఆర్ కడియంకు ఎమ్మెల్సీగా రెన్యువల్ చేస్తారా? లేక.. వేరే నాయకుడిని ఎంచుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది.
వరంగల్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ఉన్నప్పటికీ.. టీఆర్ఎస్ అధినేతతో కొన్నాళ్లుగా పడడం లేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ దఫా కడియంకు కేసీఆర్ ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని గుసగుస వినిపిస్తోంది. వయసు రీత్యా చూసుకున్నా.. ప్రస్తుతం కడియంకు 68 ఏళ్లు. ఈ నేపథ్యంలో పార్టీలో ఆయన దూకుడు ఉండే అవకాశం లేదని.. కేసీఆర్ కనుక అంచనావేసుకుంటే.. కడియంను పక్కన పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. బహుశ ఈ విషయాన్ని కేసీఆర్ చెప్పకనే చెప్పిస్తున్నారా? అన్నట్టుగా.. టీఆర్ ఎస్ నేతలు.. కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కడియంకు రెన్యువల్ అవసరం లేదని.. ఆయన వల్లా పార్టీ పుంజుకున్న పరిస్థితి లేదని.. కొందరు నాయకులు మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే.. మొత్తానికి కడియం విషయంలో కేసీఆర్ క్లియర్‌గానే ఉన్నారనే సంకేతాలు వస్తుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 27, 2021 8:14 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…