ప్రధానమంత్రి నరేంద్రమోడితో జమ్మూ-కాశ్మీర్ నేతల సమావేశం కీలకమైనదనే చెప్పాలి. దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో అనేక అంశాలపై చర్చలు జరిగాయి. అయితే అన్నింటిలోను ఐదు అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్లు ప్రతిపక్షపార్టీల నేతలు చెప్పారు. ఐదే ప్రతిపక్షాలు పట్టుబట్టిన అంశాలపై నరేంద్రమోడి సానుకూలంగా స్పంధిస్తారా అనేది మాత్రం డౌటనే చెప్పాలి.
ఇంతకీ విషయం ఏమిటంటే జమ్మూ కాశ్మీర్ కు మాత్రమే ప్రత్యేకమైన ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ-కాశ్మీర్ నుండి లడ్డాఖ్ లోయను విడదీసిన తర్వాత జరిగిన మొట్టమొదటి సమావేశం కాబట్టే దీనికి ఇంతటి ప్రాధాన్యత వచ్చింది. సరే ఇక విషయంలోకి వస్తే జమ్మూ-కాశ్మీర్ కు పూర్తిస్ధాయి రాష్ట్రహోదా ఇవ్వాలని, వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, స్ధానికులకు భూమిపై గ్యారెంటీ ఇవ్వాలని, కశ్మీరీ పండిట్ల పునరావాసానికి చర్యలు తీసుకోవాలని, రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలనేది ప్రధాన డిమాండ్లు.
పై డిమాండ్లన్నింటిని ఒకసారి గమనిస్తే ఏదో మొక్కుబడిగా మోడి సర్కార్ రెండు అంశాలను మాత్రం సానుకూలంగా స్పందించే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ ఖైదీలను విడుదల చేయటం, కశ్మీరీపండిట్ల పునరావాసానికి చర్యల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశాలు కనబడుతున్నాయి. నిజానికి కాశ్మీర్లో రాజకీయ ఖైదీలనే వాళ్ళు పెద్దగా లేరనే చెప్పాలి. రెండేళ్ళక్రితం ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా చాలామందిని హౌస్ అరెస్టులు చేసింది కేంద్రం. ఈ మధ్యనే వాళ్ళను విడుదల కూడా చెసేసింది.
మోడితో భేటిలో కూడా అలాంటి నేతలు కొందరు పాల్గొన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నా లేదా ఎవరినైనా అరెస్టులు చేసున్నా వాళ్ళని విడుదల చేయటం కేంద్రం చేతిలో పనే కాబట్టి సమస్యలేదు. అలాగే కశ్మీరీ పండిట్లకు పునరావాస చర్యల విషయం కూడా పెద్ద కష్టమేమీకాదు. ఎందుకంటే ఆస్తులను వదులుకుని దశాబ్దాల క్రితమే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన పండిట్ల కుటుంబాల్లో ఎంతమంది తిరిగి కశ్మీర్ కు తిరిగి వెళతారనేది డౌటే.
ఇక జమ్మూ-కశ్మీర్ కు పూర్తిస్ధాయి రాష్ట్రహోదా, వెంటనే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించటం, స్ధానికులకు భూమిపై గ్యారెంటీ అనే విషయంలో మాత్రం అంత తొందరగా అంగీకరించే అవకాశాలు తక్కువనే చెప్పాలి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎన్నికలని కేంద్రం అంటోంది. అదెప్పుడవుతుందో తెలీదు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం వచ్చేంతవరకు పై అంశాల్లో మోడి సానుకూలంగా ఆలోచించే అవకాశాలు తక్కువే. మరి మోడి ఏమి చేస్తారో చూడాల్సిందే.
This post was last modified on June 26, 2021 11:55 am
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…