ఏపీలో అధికారం కోల్పోయాక విలవిల్లాడుతోన్న తెలుగుదేశం పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీలో మైనార్టీ నేతలు ఎవ్వరూ ఉండడం లేదు. విచిత్రం ఏంటంటే అసలు మైనార్టీలు ఎవ్వరూ టీడీపీ వెనక ఉండడం లేదన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో బలవంతంగా పార్టీలో కొనసాగిన కొందరు నేతలు ఇప్పుడు పార్టీ నుంచి ఎప్పుడు బయటకు వద్దామా ? అన్న ఆలోచనలో ఉన్నారు. అసలు మైనార్టీ ఓటర్లు పార్టీకి ఎప్పటి నుంచో దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో వీరంతా వన్ సైడ్‌గా జగన్ కు ఓట్లేశారు.
ఇక మైనార్టీ నేతల్లో కూడా చంద్రబాబుపై నమ్మకం పోయింది. అందుకే గత ఎన్నికల తర్వాత ఎవరికి వారు తమ దారులు తాము చూసుకుంటున్నారు. తాజాగా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఎన్ఎండీ ఫరూక్ గతకొంత కాలంగా మౌనంగా ఉంటున్నారు. ఈ విషయం ఇప్పుడు పార్టీ వర్గాల్లో హైలెట్ అవుతోంది. ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
చంద్రబాబు బీజేపీ వైపు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణమని… ఇప్పటికే టీడీపీ లో మైనారిటీ నేతల వాయిస్ మూగబోయిన నేపథ్యంలో ఫరూక్ కు చంద్రబాబు గట్టిగా మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చినట్టు వినికిడి. అయినా ఆయన పార్టీలో ఉన్నారో ? లేదో ? కూడా తెలియడం లేదు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్ఎండీ ఫరూక్ టీడీపీలోనే ఉన్నారు. రాయలసీమలో మైనారిటీ నేతగా ఎన్ఎండీ ఫరూక్ కు మంచి గుర్తింపే ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన్ను ఎమ్మెల్సీని చేసి.. శాసనమండలి ఛైర్మన ను చేశారు. ఆ తర్వాత మైనార్టీ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా.. ఆయన పేరుకు మాత్రమే మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మౌనంగా ఉండడంతో బాబు క్లాస్ పీకగా.. ఆయన బాబును లైట్ తీస్కొన్నట్టు వినికిడి. ఏదేమైనా ఫరూక్ పార్టీలో ఎన్ని రోజులు ఉంటారో ? కూడా తెలియని పరిస్థితి.
This post was last modified on June 21, 2021 10:56 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…