హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)లో చోటు చేసుకున్న తగదాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. హెచ్ సీఏకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మహ్మద్ అజరుద్దీన్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయటంతో పాటు.. అతడి సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన అపెక్స్ కౌన్సిల్ తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. తనకు నోటీసులు ఇవ్వటంపై అజారుద్దీన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హెచ్ సీఏ మీద ఎమ్మెల్సీ కవిత కన్నేశారని.. అందులో భాగంగానే అజారుద్దీన్ కు పొగ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లుగా విమర్శలు ఉన్నాయి. అపెక్స్ కౌన్సిల్ కు హెచ్ సీయూ అధ్యక్షుడిగా ఉన్న తనపై చర్యలు తీసుకునే అధికారం లేదని అజార్ మండిపడుతున్నారు. ఒకవేళ ప్రస్తుత కార్యవర్గాన్ని అంబుడ్స్ మెన్ రద్దు చేస్తే.. మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేయటానికి తాను సిద్ధమేనని అజారుద్దీన్ స్పష్టం చేశారు.
తనపై ఆరోపణలు చేస్తున్న ఐదుగురు కార్యవర్గ సభ్యులే హెచ్ సీఏలో జరిగిన పలు అవినీతి పనులకు సూత్రధారులని.. రోజు ఏసీబీ కోర్టుల చుట్టూ తిరిగేటోళ్లు తనపై ఆరోపణలు చేయటం కామెడీగా ఉందన్నారు. తనపై అర్థం లేని ఆరోపణలు చేస్తూ బ్లాక్ మొయిలింగ్ కు పాల్పడుతున్నట్లు చెప్పారు. కానీ.. వారి బెదిరింపులకు తాను లొంగనని.. ప్రస్తుత వివాదంపై బీసీసీఐకి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. హెచ్ సీఏలోకి కల్వకుంట్ల కవిత ఎంట్రీ ఇచ్చేందుకే ఇదంతా జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో కవిత సంఘంలోకి రానున్నారు కదా? అన్న ప్రశ్నకు అజార్ స్పందించారు. కవిత విషయం తనకు తెలీదని.. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అది తన ఇష్టమని చెప్పటం గమనార్హం. అంతేకాదు.. హెచ్ సీఏ గాడి తప్పినట్లుగా ఇటీవల కవిత చేసిన విమర్శలు తన వరకు రాలేదన్నారు. చూస్తుంటే.. కవిత గురించి ఒక్క నెగిటివ్ మాట మాట్లాడటానికి అజారుద్దీన్ సిద్ధంగా లేరన్న విషయం ఆయన మాటలతో స్పష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on June 18, 2021 11:05 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…