టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోమారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తనదైన రేంజిలో ఫైర్ అయ్యారు. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో రెండో భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీపై గడచిన రెండు, మూడు రోజులుగా సైలెంట్ గానే ఉన్న కేసీఆర్…సోమవారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కేంద్రంపైనా, మోదీ విధానాలపైనా కేసీఆర్ తనదైన శైలి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పటిదాకా పెద్దగా విమర్శలేమీ చేయని కేసీఆర్.. ఈ సారి మాత్రం తనదైన రేంజిలో మోదీ సర్కారును కడిగిపారేశారనే చెప్పాలి.
కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని భోగస్ ప్యాకేజీగా కేసీఆర్ అభివర్ణించారు. మోదీ సర్కారు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఫ్యూడల్ విధానంలో భాగంగా ఉందని, ఫెడరల్ రాజ్యమైన భారత్ లో అది ఎలా అతుకుతుందని కూడా కేసీఆర్ ప్రకటించారు. మోదీ సర్కారు ప్రకటించిన ప్యాకేజీని విపక్షాలే కాకుండా విదేశాలు కూడా తూర్పారబడుతున్నాయని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయినా ఈ ప్యాకేజీలో కేంద్రం తనదైన ఫ్యూడల్ వైఖరిని బయటపెట్టుకుని తన పరువును తానే తీసుకుందని కూడా కేసీఆర్ మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ ప్యాకేజీలో దేశంలోని రాష్ట్రాలను కేంద్రంలోని మోదీ సర్కారు బిక్షగాళ్లలా చూసిందని కూడా కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా కేంద్రం ప్యాకేజీ… ఓ దుర్మార్గపు ప్యాకేజీనేనని కేసీఆర్ విరుచుకుపడ్డారు.
అయినా కరోనా నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రాలు కోరుకున్నది ఫ్యూడల్ తరహా ప్యాకేజీ కానే కాదని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల చేతుల్లోకి నగదు వచ్చేలా ప్యాకేజీలు ఉండాలని భావించామని, అయితే అందుకు విరుద్ధంగా నరేంద్ర మోదీ సర్కారు ఫ్యూడల్ భావజాలమున్న ప్యాకేజీని ప్రకటించిందని కేసీఆర్ నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో దేశంలోని అన్ని వ్యవస్థలు ప్రైవేట్ పరం కాక తప్పదని కూడా కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల నుంచి కేంద్రం సెస్ ల రూపంలో పన్నులు వసూలు చేస్తోందని, కేంద్రం అవలంబిస్తున్న ఈ వైఖరితో రాష్ట్రాలు మునిగిపోక తప్పదని కూడా కేసీఆర్ హెచ్చరించారు. మొత్తంగా మొన్నటిదాకా మోదీ సర్కారును ఏమీ అనని కేసీఆర్… ఇప్పుడు ఏకంగా మోదీ సర్కారుపై ఓ రేంజిలో విరుచుకుపడటం నిజంగానే ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పాలి.
This post was last modified on May 18, 2020 9:31 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…