కళ్యాణ్ దిలీప్ సుంకర.. సోషల్ మీడియాలో ఉండే తెలుగు నెటిజన్లకు ఈ పేరు బాగానే పరిచయం. ఒకప్పుడు జనసేన అధికార ప్రతినిధిగా ఉండి.. అనూహ్య పరిణామాల మధ్య ఆ పార్టీ నుంచి వెళ్లిపోయిన ఇతను.. ఇప్పుడు ఓవైపు లా ప్రాక్టీస్ చేస్తూనే ఇంకో వైపు యూట్యూబ్‌లో వివిధ అంశాల మీద వీడియోలు చేస్తూ పాపులర్ అవుతున్నాడు. ముఖ్యంగా ఈ మధ్యే ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణను కౌంటర్ చేస్తూ ‘ఓపెన్ ఎటాక్ విత్ రాకి’ పేరుతో కళ్యాణ్ చేస్తున్న స్పూఫ్ వీడియోలు సంచలనం రేపుతున్నాయి.
రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ పేరుతో నిర్వహించే ప్రోగ్రాంకు పేరడీలా ఉంటూ.. ఆర్కేతో పాటు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దాడు కళ్యాణ్. రాధాకృష్ణ హావభావాలను భలేగా అనుకరిస్తున్న వ్యక్తి ఈ ప్రోగ్రాంలో బాగా హైలైట్ అవుతున్నాడు. కులం ఆధారంగా రాజకీయాలు చేస్తాడంటూ రాధాకృష్ణ మీద ఈ కార్యక్రమంలో పరోక్షంగా గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి.
చాలా తక్కువ సమయంలో ఈ ప్రోగ్రాం బాగా పాపులర్ అయింది. ఐతే ఈ కార్యక్రమం తాజా ఎపిసోడ్ మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలోనే దుమారం రేపింది. ఈ ప్రోగ్రాంలో ఎన్టీఆర్ ప్రస్తావన తేవడం.. ఆయన కమ్మ కులస్థులకు మాత్రమే అండగా నిలిచాడు అన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడం.. ఈ క్రమంలో ‘కమ్మశిక్షణ’ పదాన్ని వాడటం.. ఆయనపై నాదెండ్ల భాస్కరరావు చేసిన తీవ్ర ఆరోపణల ప్రస్తావన రావడంతో వీడియో బాగా వైరల్ అయింది. తెలుగుదేశం వ్యతిరేకులకు ఈ వీడియో బాగానే నచ్చేసింది. జనసేన మద్దతుదారుల్లోనూ చాలామంది ఈ వీడియోను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అదే సమయంలో టీడీపీ వాళ్లకు ఈ వీడియో తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఎన్టీఆర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాలతో సంబంధం లేని తటస్థులకు కూడా ఈ వీడియో రుచించడం లేదు.
ప్రస్తుతం జనసేనలో లేనప్పటికీ.. ఆ పార్టీకి, అలాగే పవన్ కళ్యాణ్‌కు సపోర్టర్‌గా కొనసాగుతుండటంతో పరోక్షంగా ప్రభావం పడుతోంది. తెలుగుదేశం వాళ్లు, ఎన్టీఆర్ అభిమానులు.. కళ్యాణ్ వల్ల పవన్, జనసేనలను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఓవైపు చిరంజీవి ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలంటూ ఆయన జయంతి రోజు ట్వీట్ వేస్తే.. మరోవైపు జనసేన సపోర్టర్ ఎన్టీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం, దానికి జనసైనికులు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. కళ్యాణ్ చేసే వీడియోలను జనసైనికులకు తాత్కాలిక ఆనందాన్నిస్తుండొచ్చు కానీ.. పరోక్షంగా ఇవి పవన్‌కు మైనస్ అవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on June 15, 2021 5:52 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…