బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో రాజకీయ వ్యూహకర్త.. ప్రశాంత్ కిషోర్(పీకే) భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం ఆసక్తిగా మారింది. ఆ వెంటనే నెటిజన్లు కూడా స్పందించారు. షారుఖ్ ఖాన్.. రాజకీయాల్లోకి వస్తున్నారని.. అందుకే పీకేతో భేటీ అయ్యారని కొందరు వ్యాఖ్యానించారు. అయితే..ఈ విషయంపై ఇటు పీకే కానీ, అటు షారుఖ్ కానీ స్పందించలేదు.
ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకున్న అనంతరం ప్రశాంత్ కిశోర్ దేశవ్యాప్త పర్యటనలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇటీవలే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిసిన ప్రశాంత్.. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వీరి మధ్య సమావేశం ఎందుకు జరిగిందనే విషయంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. షారుక్ పొలికటికల్ ఎంట్రీ ఇస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంటే.. ఆయన నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్’ బ్యానర్లో ప్రశాంత్ బయోపిక్ రానుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే బయోపిక్ రూమర్లను రెడ్ చిల్లీస్ ప్రతినిధి తోసిపుచ్చారు.
ఇదిలావుంటే, బంగాల్ సీఎం మమతా బెనర్జీ.. షారుక్కు ప్రశాంత్ను పరిచయం చేసినప్పటి నుంచి వారిద్దరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారని తెలుస్తోంది. ఇక షారుక్ రాజకీయ రంగ ప్రవేశం ఊహాగానాలు కూడా నిరాధారమని సమాచారం. తన పనిలో సహాయపడిన వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకే ప్రశాంత్ ఈ పర్యటనలు చేస్తున్నారని తెలుస్తోంది.
This post was last modified on June 14, 2021 8:14 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…