ఏపీ సీఎం జగన్‌కు వరుస లేఖలు రాస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా మరో లేఖ సంధించారు. ఈ లేఖలో అదిరిపోయే కామెంట్లు చేశారు. సీఎం జగన్‌కు, పార్టీ నేతలకు ఆయన 48 గంటల గడువు విధించారు. ఈ లోగా చర్యలు తీసుకోకపోతే.. తానే సంచలన నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. దీంతో ఇప్పడు ఆర్ ఆర్ ఆర్ రాసిన లేఖ సీఎం జగన్‌కు మరింత షాకిస్తోంది.
కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ వెబ్‌సైట్ నుంచి ఎంపీ రఘురామకృష్ణరాజు పేరును తొలగించారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అయింది. వెంటనే స్పందించిన రఘురామ తాజాగా ఇదే విషయంపై నిలదీస్తూ.. సీఎం జగన్‌కు లేఖ సంధించారు. పార్టీ అధికారిక వెబ్‌సైట్ ఎంపీల జాబితాలో పేరు తొలగించడాన్ని లేఖలో ప్రస్తావించారు.
వైసీపీ తరఫున గెలిచిన తాను ఇప్పటికీ వైసీపీ ఎంపీగానే కొనసాగుతున్నానని.. అలాంటిది వైసీపీ వెబ్‌సైట్‌లో తన పేరును ఎందుకు తొలగించారని నిలదీశారు. పార్టీ నుంచి బహిష్కరించారా? అని సందేహం వ్యక్తం చేశారు. పొరపాటున తొలగించారా? లేక కావాలనే చేశారా? అని స్పష్టత కోరారు. కావాలని తొలగించి ఉంటే పార్టీ నుంచి బహిష్కరించినట్లు భావిస్తానని తెలిపారు.
48 గంటల్లో పేరు చేర్చకపోతే పార్లమెంట్ సెక్రటేరియట్ దృష్టికి తీసుకెళ్తానని రఘురామ స్పష్టం చేశారు. నాకు నేనుగా స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాల్సి ఉంటుందని రఘురామ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ లేఖపై వైసీపీ నాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
రాజ్యసభ, లోక్‌సభకు కలిపి వైకాపా తరఫున 28 మంది ఎంపీల పేర్లు గతంలో వెబ్‌సైట్‌లోని జాబితాలో పొందుపరిచారు. తిరుపతి నుంచి ఇటీవలే గెలిచిన గురుమూర్తి పేరును ఎంపీల జాబితాలో చేర్చారు. అయితే రఘురామకృష్ణరాజు పేరు ఇప్పుడు జాబితాలో లేదు. ఈ నేపథ్యంలో ఆయన జగన్‌కు లేఖ రాశారు.
This post was last modified on June 13, 2021 1:37 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…