మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రభావం.. టీఆర్ఎస్ పై గట్టిగానే పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 14వ తేదీన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఈటల రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయనతోపాటు.. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
అయితే.. వీళ్లు కాకుండా.. హరీష్ రావు కీలక అనుచరుడు ఒకరు కూడా పార్టీ వీడనున్నారంటూ ప్రచారం మొదలైంది. ఆర్టీసీ కార్మిక సంఘాల నేత అశ్వద్ధామ రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ కార్మిక సంఘంగా ఉన్న టీఎంయూ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అశ్వద్ధామరెడ్డి… తెలంగాణ ఉద్యమం నుండి మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. కొంతకాలం క్రితం వరకు టీఎంయూకు గౌరవ అధ్యక్షుడిగా కూడా హరీష్ రావే ఉండేవారు.
అయితే, ఇటీవల ఆర్టీసీ కార్మికులంతా సమ్మె బాట పట్టడంతో అశ్వద్ధామ రెడ్డి… టీఆర్ఎస్ పార్టీతో కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన్ను ఆ సంఘం నుండి పంపేందుకు టీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ దశలో అశ్వద్ధామ రెడ్డి బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on June 12, 2021 9:10 am
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…