ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ హిందూవుల ఆగ్రహానికి బలౌతోంది. మా దేవుడినే కించపరుస్తారా అంటూ.. ప్రస్తుతం ఇన్ స్టాపై అందరూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ యాప్‌లో ఉన్న జిఫ్ ఫొటోలలో శివుడి చేతిలో మందు గ్లాస్.. సెల్‌ఫోన్ ఉన్నాయంటూ ఓ బీజేపీ నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అక్కడితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఫొటోలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఇన్‌స్టాగ్రామ్ సీఈఓపై సదరు బీజేపీ నేత పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళితే.. ఇన్‌స్టాగ్రామ్‌లోని సెర్చ్ బాక్స్‌లో శివ్ అని టైప్ చేస్తే శివుడు రూపాలు రాగా వాటిలో ఒక ఫొటోలో పరమేశ్వరుని చేతిలో మందుగ్లాస్, సెల్‌ఫోన్ పట్టుకున్నట్లుగా ఉంది. దీనిని గమనించిన మనీశ్ సింగ్ అనే బీజేపీ నేత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కోట్లాది మంది ప్రజలు శివుడిని పూజిస్తారని.. వారి మనోభావాలు దెబ్బతినేలా ఇన్‌స్టాగ్రామ్ అభ్యంతరకరంగా జిఫ్ స్టిక్కర్ రూపొందించిందని మనీశ్ సింగ్ మీడియాతో అన్నారు. ఇదంతా చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు, రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన ఆరోపించాడు. కాగా, మనీశ్ సింగ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
This post was last modified on June 10, 2021 11:54 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…