గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీచేసింది. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణరాజు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు చేసిన ఫిర్యాదులో ఎస్పీ పేరు కూడా ఉంది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న తనను తొందరగా డిస్చార్జి చేయించాలనే కుట్రలో రిజిస్ట్రార్ కేపీరెడ్డి, టీటీడీ జేఈవో ధర్మారెడ్డితో కలిసి అమ్మిరెడ్డి కుట్ర చేసినట్లు ఎంపి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
నిజానికి ఎంపి ముగ్గురిపై ఫిర్యాదు చేశారు కానీ అందుకు అవసరమైన ఆధారాలను ఎక్కడా చూపలేదు. ఆసుపత్రిలోని మెస్ లో కేపీ రెడ్డి ఏపి పోలీసులకు భోజనం పెట్టించారనే ఓ బిల్లు తప్ప కేపీ రెడ్డి కుట్రకు మరే ఆధారం చూపలేదు. అయితే తన ఫిర్యాదులో ధర్మారెడ్డి, రెగ్యులర్ ఎస్పీ అమ్మిరెడ్డికి వ్యతిరేకంగా ఎంపి ఎలాంటి ఆధారం చూపలేదు. తనపై ఎంపి చేసిన ఆరోపణలపై వ్యక్తిగతంగా ఎస్పీకానీ లేదా ప్రభుత్వం కూడా ఏమీ స్పందించలేదు.
అయితే హఠాత్తుగా ఎస్పీని ప్రభుత్వం బదిలీచేసింది. తొందరలో బదిలీలు జరుగుతుందని, అందులో అమ్మిరెడ్డికి మంచి పోస్టింగ్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపధ్యంలోనే ఎస్పీని బదిలీ చేయటమే ఆశ్చర్యమంటే పైగా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవటం మరింత ఆశ్చర్యరంగా ఉంది. ఎస్పీని బదిలీ చేయటం ద్వారా అసలు ప్రభుత్వం ఏమి చెప్పదలచుకుందో ఎవరికీ అర్ధం కావటంలేదు.
This post was last modified on June 2, 2021 5:09 pm
హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ కి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు అవసరమా అని…
సినిమాల మేకింగ్ ముచ్చట్లను రిలీజ్ తర్వాత ఆన్ లైన్లో రిలీజ్ చేయడం మామూలే. చాలా వరకు యూట్యూబ్లోనే అలాంటి వీడియోలు…
నిన్న రాత్రి హఠాత్తుగా దేశవ్యాప్తంగా ఉన్న పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో పుష్ప 2 ది రూల్ బుకింగ్స్ తీసేయడం సంచలనమయ్యింది.…
టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…