వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్.. బెయిల్ రద్దు కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ యూటర్న్ తీసుకుందా? ఈ విషయంలో చాలా నర్మగర్భంగా వ్యవహరించిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎట్టకేలకు ఇటు సీఎం జగన్, అటు సీబీఐ కూడా కౌంటర్లు దాఖలు చేయడం గమనార్హం.
ఈ కౌంటర్లలో జగన్ వాదన ఎలా ఉన్నప్పటికీ.. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ మాత్రం జగన్‌కు చిర్రెత్తు కొచ్చేలా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండే.. సీబీఐని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు జగన్ ఇటీవల కాలంలో ప్రయత్నించారనే వాదన ఉంది. ముఖ్యంగా కరోనా కట్టడి విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోడీపై తీవ్రంగా మండి పడుతుంటే.. జగన్ మాత్రం ప్రధానిని వెనుకేసుకు వచ్చారు.
దీంతో తనపై ఉన్న బెయిల్ రద్దు పిటిషన్‌ను దృష్టిలో పెట్టుకునే.. జగన్ ఇలా ప్రధానిని భుజానికెత్తుకున్నారనే వాదన వచ్చింది. అయితే.. తీరా విషయానికి వచ్చే సరికి.. జగన్‌కు సీబీఐ పక్కాగా హ్యాండిచ్చేసి నట్టు తెలుస్తోంది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై మెమో దాఖలు చేసిన సీబీఐ.. దీనిలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎంపీ రఘురామ పిటిషన్‌పై చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరింది.
అంటే.. సీబీఐ కోర్టు.. జగన్ విషయంలో విచారణ కొనసాగించాలని కానీ, వద్దని కానీ, కోరకపోయినా.. కోర్టు నిర్ణయానికే వదిలి వేయడం గమనార్హం. కాగా, కోర్టు ఇప్పటికే.. దీనిని విలువైన పిటిషన్‌గా పేర్కొనడం గమనార్హం. ఆదిలో విచారణార్హత తేలుస్తామన్న కోర్టు.. తర్వాత.. దీనికి విచారణార్హత ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఇప్పుడు సీబీఐ కూడా కర్ర విరగకుండా.. పాము చావకుండా వ్యవహరించడంతో జగన్‌కు ఉచ్చు బిగుస్తున్నట్టేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే.. ఈ నెల 14 వరకు ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.
This post was last modified on %s = human-readable time difference 6:33 pm
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…
తండేల్ విడుదల తేదీ లీకైపోయింది. ఫిబ్రవరి 7 థియేటర్లలో అడుగుపెట్టబోతున్నట్టు ఇవాళ జరిగే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు…