జగన్మోహన్ రెడ్డి నమోదైన అక్రమాస్తుల కేసుల జాబితాలో మరోటి చేరింది. ఇప్పటికే అక్రమాస్తుల ఆరోపణలపై సీబీఐ 11 కేసులు, ఈడీ 6 కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులన్నీ గడచిన 12 సంవత్సరాలుగా వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని ధిక్కరించి జగన్ పార్టీలో నుండి బయటకు వచ్చేశారు. తర్వాత కొత్త వైఎస్సార్పీపీ ఏర్పాటు చేసుకున్నారు.
కాంగ్రెస్ ను కాదని బయటకు రాగానే జగన్ పై కేసుల నమోదయ్యాయి. అప్పటి నుండి ఇప్పటివరకు విచారణ సా….గుతూనే ఉన్నాయి. అలాంటి కేసుల జాబితాలో తాజాగా మరోటి చేరింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపి హౌసింగ్ బోర్డు+ఇందు ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో మొదలైన హౌసింగ్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో అభియోగపత్రాన్ని ఈడీ దాఖలు చేసింది.
తాజా కేసులో జగన్ తో మరో 11 మందిని నింతితులుగా చేర్చింది ఈడీ. నిజానికి తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ ప్రేరిపితమైనవే అని జగన్ మొదటినుండి వాదిస్తున్నారు. జగన్ వాదనకు కాంగ్రెస్ అగ్రనేతల గులాంనబీ ఆజాద్, జై రాం రమేష్ లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. పై నేతలు మాట్లాడుతు జగన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండుంటే కేసుల గొడవే ఉండేది కాదని చాలాసార్లు చెప్పారు. వాళ్ళ మాటలను బట్టే జగన్ పై పడిన కేసులన్నీ రాజకీయంగా పెట్టినవే అని అర్ధమవుతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గడచిన 12 ఏళ్ళుగా కేసుల విచారణ నత్తనడక నడుస్తోంది. అధికారంలో ఉన్న వైఎస్సార్ ను అడ్డంపెట్టుకుని జగన్ అవినీతికి పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. అయితే అవినీతిలో భాగస్వాములుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారుల పాత్ర లేదని చాలామందిపై కేసులు కొట్టేసింది కోర్టు. అలాగే మంత్రివర్గానికి సంబంధం లేదని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు సమాధానమిచ్చింది.
ఇన్ని సంవత్సరాలుగా కేసులను విచారణ సంస్ధలు దర్యాప్తు చేస్తున్నా ఒక్క కేసును కూడా ఫైనల్ చేయలేదు. పైగా జగన్ పై ప్రధానంగా వినబడుతున్న క్విడ్ ప్రో కో కేసుల్లో కొన్నింటిని కోర్టులు కొట్టేశాయి. మరి ఇంకెంత కాలం కేసుల విచారణ జరుగుతుందో ఎవరు చెప్పలేకున్నారు. ఇలాంటి పరిస్దితుల్లో తాజాగా మరో కేసు నమోదైందంటే దీని విచారణ ఇంకెంత కాలం సాగుతుందో చూడాలి.
This post was last modified on May 30, 2021 1:31 pm
ప్యాపారుల మంత్రం ధనార్జనే. అందులో తప్పేమీ లేదు. అయితే జనం లైఫ్ స్టైల్ ఆధారంగా ఇష్జారాజ్యంగా ఆర్జించడమే దోపిడీ. మొన్నటిదాకా…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా గడచిన 4 రోజులుగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు గురువారంతో ముగిశాయి. పెట్టుబడులు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా గురువారం చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు…
రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. పనిచేసుకుని పోవడం తెలిసిందే. అయితే.. చంద్రబాబు హయాంలో మాత్రం ఏదో గుడ్డిగా పనిచేసుకుని పోతున్నామంటే…
నందమూరి బాలకృష్ణ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ని తమిళ టాప్ స్టార్ విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్…
ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్…