కరోనా వైరస్ కు విరుగుడుగా ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేధం మందు ఫార్మాలా చెప్పాలని వేధింపులు మొదలయ్యాయా ? అవుననే అంటున్నారు ఆనందయ్య. ఈ మేరకు కోర్టులో పిటీషన్ కూడా వేశారు. తాను వాడుతున్న మందులోని దినుసుల వివరాలు చెప్పాలని, వాటిని మిక్స్ చేసే ఫార్ములాను చెప్పాలని తన అధికారులు వేదిస్తున్నట్లు ఆనందయ్య తన పిటీషన్లో ఆరోపించారు.
కరోనా మందు పంపిణీ కార్యక్రమాల్లో అధికారుల జోక్యం లేకుండా చూడాలంటు ఆనందయ్య వేసిన కేసును హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇప్పటికే నాటుమందు పంపిణీ విషయంలో అనేకమంది కోర్టులో కేసులు వేశారు. వేసిన కేసులన్నీ ఆనందయ్యకు అనుకూలంగా దాఖలైనవి కావటం గమనార్హం. కేసులను విచారిస్తున్న కోర్టు కూడ ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందు విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆనందయ్య మందును పరిశీలించిన ఆయుష్ ఉన్నతాధికారులు అందులో ఎలాంటి హానికారకమైన వస్తువులు దినుసులు లేవని స్పష్టం చేశారు. అలాగే కేంద్రప్రభుత్వానికి చెందిన మరో సంస్ధ కూడా నాటుమందుపై అధ్యయనం చేస్తోంది. ఇదే సమయంలో టీటీడీ కూడా తన ఆయుర్వేద కాలేజీ ల్యాబ్ లో ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందును పరీక్షించింది.
ఎక్కడ ఎవరు మందును పరీక్షించినా అందులో వాడే దినుసులు, వస్తువులు హానికరం కాదనే చెబుతున్నారు. మందులో ఎలాంటి హానికరమైన దినుసులు లేనపుడు ఆనందయ్య మందును ఎందుకు ప్రభుత్వం అడ్డుకుందో ఎవరికీ అర్ధం కావటంలేదు. అధికార+ప్రతిపక్షాల నేతలంతా ఆనందయ్య ముందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు. అలాగే మందు తీసుకోవటానికి జనాలు రెడీగా ఉన్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ఏదో కారణంతో జాప్యం చేస్తునే ఉంది. ఇంతలోనే మందు ఫార్ముల చెప్పాలనే వేధింపులు మొదలైనట్లు ఆనందయ్య ఆరోపించటం సంచలనంగా మారింది.
This post was last modified on May 30, 2021 11:04 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…