రాజకీయాల్లో మిత్రులైన తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ , ఏపీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య పరిపాలన సహా అనేక అంశాల గురించి పోలిక ఉండే సంగతి తెలిసిందే . వివిధ అంశాల్లో ఈ ఇద్దరు నేతల నిర్ణయాలు , వైఖరి సహజంగానే ప్రజలు విశ్లేషించుకునేందుకు చాన్స్ ఇస్తుంటాయి. ప్రస్తుతం కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ యొక్క వైఖరి చర్చకు తెరలేపింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించకపోవడంపై ఆ రాష్ట్ర విజిలెన్స్ అధికారులు కొరడా ఝులిపించారు. నిబంధనలు పాటించడాన్ని పరిశీలించి వాటిని ఉల్లంఘిస్తున్న గుంటూరులో 52 కొవిడ్ ఆస్పత్రులపై అధికారులు కొరడా ఝులిపించారు. ఆరోగ్యశ్రీ కింద 50శాతం పడకలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు. 52 ఆస్పత్రులకు మొత్తంగా రూ.1.25కోట్ల జరిమానా విధించారు. సహజంగానే ఈ వార్త పెద్ద ఎత్తున ప్రజల దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో చర్చకు తెరలేపింది.
హైదరాబాద్‌లో కరోనా చికిత్స అందిస్తున్న ప్రైవేటు హాస్పిటల్లలో అనేకం నిబంధనలు యథేచ్చగా ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. చికిత్స భారీ ఫీజులు వసూలు చేయడం నుంచి మొదలుకొని చనిపోయిన వ్యక్తి కుటుంబానికి చివరి చూపు కోసం శవం అప్పగించే వరకు రోజుకు పదుల సంఖ్యలో వార్తలు మీడియాలో , సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదరు బాధితుల ఆవేదన ఎందరినో కలచివేస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు శూన్యమని పలువురు భగ్గుమంటున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ సర్కారు దూకుడుగా ముందుకు సాగి భారీ ఫైన్లు వేసింది. మరి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.
This post was last modified on May 27, 2021 7:15 pm
షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…