తెలంగాణలో అమలు చేస్తున్న లాక్ డౌన్ ఈ నెల 30తో ముగియనుంది. అంటే.. మరో మూడు రోజులు. ఆదివారంతో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ముగియనుంది. మరి.. తర్వాత ఏం చేస్తారన్నది ప్రశ్నగా మారింది. గతంతో పోలిస్తే.. కొవిడ్ కేసులపైనా.. దాని తీవ్రత మీదా.. చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు.
గతంలో లాక్ డౌన్ అన్నంతనే.. రాష్ట్రానికి పోయే ఆదాయం గురించి ప్రస్తావన వచ్చేదని.. అందుకు భిన్నంగా ఇప్పుడు మాత్రం ప్రజల ఆరోగ్యం గురించి సీఎం కేసీఆర్ మాటల్లో వినిపిస్తోందని చెబుతున్నారు. అనారోగ్యాన్ని పెంచుకుంటూ పోయే కన్నా.. ఆర్థికంగా కొంత నష్టం జరిగినా.. ప్రజలు ఆరోగ్యంగా ఉండటం మంచిదన్న భావన ఆయన మాటల్లో వ్యక్తమవుతోందని చెబుతున్నారు. ఈ కారణంతోనే.. మరో ఆలోచన లేకుండా లాక్ డౌన్ పొడిగించారని.. తాజాగా మరోసారి పొడిగింపు ఉంటుందని చెబుతున్నారు.
ఈ నెల 30నుంచి వచ్చే నెల 15 వరకు లేదంటే 10 వరకు అయితే పొడిగింపు నిర్ణయాన్ని 30న జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా ఫలితం రావటమే కాదు.. రాష్ట్రంలో కేసుల తీవ్రత తగ్గుతుందని.. రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గే వీలుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. అయితే.. ఈసారి లాక్ డౌన్ పొడిగింపు వేళలో.. ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే వీలుందని చెబుతున్నారు.
ప్రస్తుతం లాక్ డౌన్ ను ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు మినహాయింపు ఇవ్వటం.. ఈ టైంలో అన్ని వ్యాపార సంస్థలు తమ వ్యాపారాల్ని నిర్వహించుకోవటానికి వీలు కల్పించటం తెలిసిందే. తాజాగా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో.. ఉదయం 10 గంటల వరకు ఉన్న పొడిగింపును మధ్యాహ్నం 12 గంటల వరకు పెంచే వీలుందని తెలుస్తోంది. అలా చేయటం ద్వారా.. వ్యాపార వర్గాల వారికి.. మిగిలిన వారికి అంతో ఇంతో వెసులు బాటు ఉంటుందని చెబుతున్నారు. ఈ పొడిగింపుతో వచ్చే ఫలితాల ఆధారంగా మరిన్ని రోజులు లాక్ డౌన్ విధించాలా? లేదా? అన్న నిర్ణయం ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on May 27, 2021 10:37 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…