ఆ అమ్మాయి పేరు హృతీక్ష. తన వయసు తొమ్మిదేళ్లు. ఇప్పుడా చిన్నారి ఒక మొబైల్ ఫోన్ కోసం ఎదురు చూస్తోంది. ఆ ఫోన్ తెచ్చివ్వాలని వేడుకుంటోంది. తన కోసం సామాజిక మాధ్యమాల్లో వేలాది మంది ఆ ఫోన్ కోసం విన్నపాలు చేస్తున్నారు. పోలీసులు కూడా ఆ మొబైల్ కోసం గట్టిగానే వెతుకుతున్నారు. కానీ వారం రోజులకు పైగా ప్రయత్నిస్తున్నా ఇంకా ఆ మొబైల్ దొరకలేదు.
ఇంతకీ ఆ మొబైల్‌లో ఏముంది.. దాని కోసం ఇంతమంది తపిస్తుండటానికి కారణమేంటి అంటే.. అది ఇటీవలే మృతి చెందిన ఆ చిన్నారి తల్లికి చెందిన మొబైల్. అందులో తన తల్లి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని.. తల్లిని కోల్పోయిన తనకు ఇక జీవితాంతం ఆమె జ్ఞాపకాలను చూసుకునే అవకాశం కల్పించాలని ఆ చిన్నారి కోరుతోంది. ఈ మేరకు ఆ చిన్నారి పోలీసులకు ఒక లేఖ కూడా రాయడం గమనార్హం. హృదయాన్ని ద్రవింపజేసే ఈ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో జనాలను కదిలిస్తోంది.
కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి హృక్షిత. ఆమె తల్లి ప్రభ కరోనాతో పోరాడి ఓడిపోయింది. ఈ నెల 16న ప్రాణాలు విడిచింది. ముందు రోజు కుటుంబ సభ్యులతో ఆమె ఫోన్లో మాట్లాడింది. కానీ తర్వాత మొబైల్ స్విచాఫ్ అయింది. తర్వాతి రోజు ప్రభ చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు సమాచారం అందించాయి. ఐతే మృతదేహాన్ని అప్పగించే సమయంలో ఆమె మొబైల్ జాడ లేకపోయింది.
అప్పట్నుంచి కాల్ చేస్తుంటే మొబైల్ స్విచాఫ్ అని వస్తోంది. తల్లికి సంబంధించినవే కాక తనతో కలిసి దిగిన ఎన్నో ఫొటోలు ఆ మొబైల్లో ఉండటంతో వాటన్నింటినీ భద్రంగా దాచుకోవాలని హృతీక్ష కోరుకుంటోంది. అందుకే తన తల్లి మొబైల్ వెతికి పెట్టాలని పోలీసులకు ఆ అమ్మాయి లేఖ రాసింది. పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు. ఆసుపత్రిలో విచారించారు. మొబైల్‌ను ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఆ మొబైల్ దొరికి తల్లిని కోల్పోయిన ఆ చిన్నారికి కొంచెమైనా ఉపశమనం దక్కుతుందని ఆశిస్తున్నారు.
This post was last modified on May 25, 2021 6:59 am
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…