ఏ పార్టీ కైనా ఒక సమయం అంటూ వస్తుంది. అలా మంచి సమయం అందివచ్చినప్పుడు.. అందిపుచ్చుకుం టే .. ఇక ఆ పార్టీకి తిరుగు ఉండదని అంటారు పరిశీలకులు. 1983లో టీడీపీ, 1989లో కాంగ్రెస్, తర్వాత 2004లో కాంగ్రెస్, 2014లో మళ్లీ టీడీపీ, 2019లో వైసీపీకి అలాంటి ఛాన్సులే వచ్చాయి. అధికారంలో ఉన్న పార్టీ చేసే తప్పులను కరెక్టుగా అందిపుచ్చుకున్న ప్రతిపక్షాలే వెంటనే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏపీలో ఇప్పుడు ప్రభుత్వంపై సగం మంది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఒకవైపు లాక్ డౌన్‌ను అమలు చేస్తూనే.. ప్రజలకు ఎలాంటి సహాయ సహకా రాలు అందించడం లేదు. దీంతో పేదలు ఆగ్రహంతో ఉన్నారు. ఇక, వ్యాక్సిన్ ఇవ్వడానికి డబ్బులు లేవంటూనే.. మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. దీంతో మధ్య తరగతి మానవులు జగన్‌పై ఆగ్రహంతో ఉన్నారు.
కరోనా తొలి వేవ్ విషయంలో జగన్ ప్రభుత్వం కేసుల కట్టడిలో చాలా వరకు సక్సెస్ అయ్యామని జనాలను నమ్మించింది. గ్రౌండ్ లెవల్లో వాస్తవ, అవాస్తవాలు ఎలా ఉన్నా తెలంగాణలో అప్పుడు ఉన్నంత వ్యతిరేకత తొలి వేవ్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి రాలేదు. సెకండ్ వేవ్ విషయంలో ఏపీ ప్రభుత్వ వైఫల్యం అనేది సామాన్య ప్రజల్లోకి స్పష్టంగా వెళ్లిపోయింది. తొలి వేవ్ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక విషయంలోనూ ప్రజలు జగన్‌కే బ్రహ్మరథం పట్టి జగన్‌పై తమకు ఉన్న అభిమానం చెక్కు చెదర్లేదని ఫ్రూవ్ చేసుకున్నారు.
ఈ సమయంలో ప్రజలకు ఎవరైనా అండగా ఉంటే బాగుండు ? అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. అదే సమయంలో తమ సమస్యలకు పరిష్కారం చూపించే నేతలు కనిపిస్తే బాగుండు అని ప్రజల్లో ఆలోచన అయితే స్టార్ట్ అయ్యింది. నిజానికి ఇప్పుడున్న సమయాన్ని పరిశీలకులు.. ఎన్నికలకు మించిన సమయంగా పేర్కొంటున్నారు. మరి ఇప్పుడున్న ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ పూర్తిగా విఫలమవుతోందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. కరోనా భయంతోనో లేక.. మరేమో తెలియదు కానీ.. టీడీపీ నాయకులు ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రావడం లేదు. ఇంకొందరు నియోజకవర్గంలోనే ఉంటూ.. లేమని సందేశాలు ఇప్పిస్తున్నారు.
దీంతో పార్టీ అధినేత చంద్రబాబే స్వయంగా హైదరాబాద్‌లో కూర్చుని ఒక్కరే.. జూమ్‌లో ప్రభుత్వానికి వార్నింగులు ఇస్తున్నారు. మీడియాకు సందేశాలు ఇస్తున్నారు. ఇక, లోకేష్ ఊసు అప్పుడెప్పుడో వినిపించిందే తప్పా లోకేష్ కూడా పూర్తి స్థాయిలో బయటకు రాలేని పరిస్థితి. ఓ వైపు ముఖ్యమంత్రి తాడేపల్లి ఫ్యాలెస్ గేటు దాటి బయటకు రావడం లేదు. ఇదే అదనుగా ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న చంద్రబాబో లేదా ఆయన కుమారుడో ప్రజల్లోకి వస్తే వచ్చే మైలేజ్ వేరుగా ఉంటుంది. వీళ్లను ఆదర్శంగా తీసుకుని నియోజకవర్గాల్లో కూడా పార్టీ నేతలు ప్రజల్లో ఉంటారు. కాని అటు అధిష్టానం, ఇటు నాయకులు చేష్టలుడిగి చూస్తుండడంతో పార్టీ మరింత దిగజారుతోన్న పరిస్థితి. ఓ గోల్డెన్ ఛాన్స్‌ను టీడీపీ వదులుకుంటుందా ? అన్న సందేహాలు కూడా అందరికి కలుగుతున్నాయి.
This post was last modified on May 24, 2021 2:11 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…