Political News

మూడో వేవ్ లో అన్నా జాగ్రత్త పడుతుందా ?

సెకెండ్ వేవ్ కరోనా వైరస్ తీవ్రతను సమర్ధవంతంగా ఎదుర్కోవటంలో కేంద్రంతో పాటు రాష్ట్రప్రభుత్వం విఫలమైంది. అన్నీ రాష్ట్రప్రభుత్వాలు విఫలమైనట్లే ఏపి కూడా ఫెయిలైందని సమర్ధించుకుంటే సరిపోదు. ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ కిందే పరిగణించాలి. సరే జరిగిందేదో జరిగిపోయిందని అనుకుంటే కనీసం థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకైనా ముందునుండే రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.

తొందరలోనే థర్డ్ వేవ్ తీవ్రంగా విరుచుకుపడబోతోందని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఎప్పటినుండో హెచ్చరిస్తున్నారు. సెకెండ్ వేవే ఇంత భయకరంగా ఉంటే ఇక థర్డ్ వేవ్ తీవ్రత ఇంకెలాగుంటుందో ఊహించేందుకే భయంగా ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇప్పటినుండే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ముందజాగ్రత్తలు మొదలుపెట్టేశాయి.

పిల్లలమీద కరోనా వైరస్ తీవ్రత పడకూడదంటు ఇప్పటినుండే పీడియాట్రిక్స్ ఆసుపత్రులను, వార్డులను రెడీ చేసుకోవాలి. పీడియాట్రిక్స్ నిపుణులతో ఓ కమిటి వేసి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై సలహాలు తీసుకోవాలి. వాళ్ళ సూచనల ప్రకారం అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలి. ప్రతి జిల్లాలోను అవకాశం ఉంటే పెద్ద పట్టాణాల్లో కూడా పిల్లల కోసమే ప్రత్యేక ఆసుపత్రులను రెడీచేయాలి. ఇప్పటికే ఉన్న ఆసుపత్రుల్లోనే పిల్లల కోసం ఏర్పాట్లు చేయాలి.

పిల్లల వైద్య నిపుణులతో రెగ్యులర్ గా టచ్ లో ఉండటంతో పాటు అవసరమైన నిపుణులను ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలి. ప్రైవేటు డాక్టర్లను కూడా పిల్లల వైద్య అవసరాల కోసం ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. ఈ మేరకు ముందుగానే డాక్టర్ల అసోసియేషన్లతో సమావేశమవ్వాలి. అందుకు డాక్టర్లకు అవసరమైన సౌకర్యాలను అన్నీ ఆసుపత్రులు, వార్డుల్లో ఏర్పాట్లు చేయాలి.

ఆక్సిజన్ ప్లాంట్లను రెడీ చేసుకోవటమే కాకుండా ప్రత్యామ్నాయాలను కూడా సిద్ధం చేసుకోవాలి. అన్నీ రాష్ట్రాలు రెడీ అవుతున్న పద్దతులేంటో తెలుసుకుని జగన్ సర్కార్ కూడా అందుకు సిద్ధంగా ఉండాలి.

This post was last modified on May 24, 2021 11:20 am

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

2 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

4 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

10 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

13 hours ago