ఏపీ రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఇక ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణం గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ లేదు. పై నుంచి కింది వరకు అన్ని పదవులు ఏకపక్షంగా ఒకే పార్టీకి దక్కుతున్నాయి. పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుడు వరకు అందరూ వైసీపీ వాళ్లే ఉన్నారు. అన్ని చోట్లా వైసీపీ వాళ్లే ఆధిపత్యం అయినా ఒక్క శాసనమండలిలో మాత్రమే టీడీపీ ఆధిపత్యం ఉంది. అయితే జూలైలో మండలిలో కూడా వైసీపీకి స్పష్టమైన ఆధిపత్యం రానుంది. ఇక్కడ ఆధిపత్యం లేకపోవడంతోనే జగన్ చివరకు మండలిని పూర్తిగా రద్దు చేసేయాలని సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
మండలిలో కీలకమైన కేబినెట్ ర్యాంకు హోదా ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్లు కూడా వైసీపీకి చెందిన వారే ఉంటారు. ఇప్పటి వరకు మండలి చైర్మన్‌గా ఉన్న టీడీపీకి చెందిన షరీప్ రిటైర్ అవుతున్నారు. మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటే సగానికి పైగా టీడీపీకి చెందిన వారే ఉన్నారు. అందుకే మండలిలో పలు బిల్లులను టీడీపీ ఈ రెండేళ్లలో అడ్డుకుంది. చివరకు ఇది పెద్ద రభసగా మారి.. జగన్ ఏకంగా మండలి రద్దు చేసేంత సాహస నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి వరకు మండలి రద్దు చేస్తానన్న జగన్ ఇప్పుడు ఈ నిర్ణయం విరమించుకునే యోచనలోనే ఉన్నారట.
ఇక ఇప్పుడు మండలి చైర్మన్ పదవి వైసీపీ నుంచి ఎవరికి వస్తుందన్నదే కాస్త చర్చల్లో అంశంగా మారింది. మండలి చైర్మన్ పదవికి కేబినెట్ ర్యాంకుతో పాటు స్పీకర్ స్థాయిలో గౌరవం, ప్రొటోకాల్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ పదవి కోసం ఇప్పటికే వైసీపీలో ఎమ్మెల్సీలుగా ఉన్న వారితో పాటు కొత్తగా ఎమ్మెల్సీ రేసులో ఉన్న వారు కూడా లాబీయింగ్ మొదలు పెట్టేశారట. జగన్ మనస్సులో ఎవరు ? ఉన్నారన్నది ఇప్పటకి ఆయన అంతరగీకులకు కూడా అంతుపట్టడం లేదట. అయితే ఇప్పటి వరకు జగన్ పదవుల పంపిణీ చూస్తే మైనార్టీ, ఎస్సీ, బీసీలతో పాటు మహిళలకు కూడా ఎక్కకువ ప్రాధాన్యం ఇచ్చారు.
వీరితో పాటు మహిళలకు కూడా చాలా ఎక్కువ పదవులు ఇచ్చారు. విజయవాడ లాంటి జనరల్ మేయర్ పదవిని బీసీ మహిళకు కట్టబెట్టారు. వైజాగ్ మేయర్ పదవి బీసీ జనరల్ అయితే బీసీ మహిళకు ఇచ్చారు. ఈ క్రమంలోనే మండలి చైర్మన్ విషయంలో కూడా జగన్ ఎవ్వరూ ఊహించని విధంగా మహిళా ఎమ్మెల్సీకే కట్టబెడతారని పార్టీలో కొత్త చర్చ అయితే స్టార్ట్ అయ్యింది. మరి ఫైనల్‌గా జగన్ డెసిషన్ ఎలా ? ఉంటుందో ? చూడాలి.
This post was last modified on May 23, 2021 10:23 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…