నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుకు చేసిన పరీక్షల విషయంలో అన్నీ పార్టీల్లోను టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే గుంటూరు జిల్లా మున్సిఫ్ కోర్టు ఆదేశాల ప్రకారం ముగ్గురు డాక్టర్ల బోర్డు ఒకసారి ఎంపికి వైద్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. సీఐడి కస్టడీలో ఉన్నపుడు పోయిన శుక్రవారం రాత్రి కొందరు గుర్తుతెలీని వ్యక్తులు దారుణంగా కొట్టారంటు ఎంపి చేసిన ఆరోపణల నేపధ్యంలో వైద్య పరీక్షలు చేయించాల్సిన అవసరం వచ్చింది.
అయితే మున్సిఫ్ కోర్టు మెడికల్ బోర్డుతో పాటు క్రాస్ చెకింగ్ కోసం రమేష్ ఆసుపత్రి వైద్యులతో కూడా పరీక్షలు నిర్వహించాలని ఎంపి తరపు లాయర్ పట్టుబట్టారు. దీన్ని సీఐడీ తరపు లాయర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఇదే పాయింట్ పై ఎంపి కొడుకు భరత్ కూడా సుప్రింకోర్టులో కేసు వేశారు. తన తండ్రికి ఢిల్లీలోని ఎయిమ్స్ లో పరీక్షలు, వైద్యం చేయింలని కోరారు. ఈ విషయమై సుప్రింకోర్టులో విచారణ జరిగినపుడు మధ్యేమార్గంగా సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు, వైద్యం అందించాలని కోర్టు డిసైడ్ చేసింది.
సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం రఘురామకు ఆర్మీ ఆసుపత్రిలో మంగళవారం పరీక్షలు నిర్వహించారు. గుంటూరులో పరీక్షించిన మెడికల్ బోర్డు ఎంపిని ఎవరు కొట్టలేదని నిర్ధారించింది. ఎంపి పాదల రంగుమారటానికి కారణం ఎడీమా అనే సమస్యగా నిర్ధారించింది. మరి తాజాగా ఆర్మీ వైద్యులు చేసిన పరీక్షల్లో ఏమి తేలిందనే విషయంలో అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.
మంగళవారం సాయంత్రానికి ఆర్మీ డాక్టర్లు తమ రిజల్టును హైకోర్టు రిజిస్ట్రార్ కు అందించారు. వైద్య పరీక్షల రిజల్టుతో పాటు మొత్తం ప్రక్రియను చిత్రీకరిచింన వీడియోను కూడా అందించారు. వీడియో కవరేజీ ఫుటేజీతో పాటు వైద్య పరీక్షల రిజల్టును కూడా రిజిస్ట్రార్ సీల్డ్ కవర్లో సుప్రింకోర్టుకు పంపేశారు. వైద్యుల ఫైండిగ్స్ ఏమిటనే విషయాన్ని సుప్రింకోర్టు శుక్రవారం విచారణలో ఓపెన్ చేస్తుంది. అప్పటివరకు పార్టీనేతల్లో బాగా టెన్షన్ పెరిగిపోతోంది.
ఆర్మీ వైద్యుల పరీక్షల్లో కూడా మెడికల్ బోర్డు రిజల్టే రిపీటైతే రాజకీయం ఒకరకంగా ఉంటుంది. అలాకాకుండా మెడికల్ బోర్డు రిజల్టుతో విభేదిస్తే మరో రకంగా ఉంటుంది. ఏదేమైనా ఆర్మీ డాక్టర్ల ఫైండిగ్స్ పైనే రఘురామ భవిష్యత్తు రాజకీయం ఆధారపడుందనే విషయంలో మాత్రం సందేహంలేదు.
This post was last modified on May 19, 2021 11:54 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…