శైలజా టీచర్.. కేరళ జనాలకు ఈ పేరు వింటే ఒక భరోసా. ఒక పాజిటివ్ ఫీలింగ్. కేరళ ఆరోగ్య మంత్రిగా గత ఏడాది కాలంలో ఆమె అందించిన సేవల గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. కొవిడ్ కల్లోల పరిస్థితుల్లో పగలూ రాత్రీ అని తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తూ.. రాష్ట్రంలో వైరస్‌ను నియంత్రించడంలో.. ఆరోగ్య సేవలను విస్తరించడంలో.. వసతులను మెరుగుపరచడంలో ఆమె చూపించిన చొరవ గురించి ఎంతో చర్చ జరిగింది.
వ్యాక్సినేషన్ కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంతో మెరుగ్గా జరగడంలో శైలజ పాత్ర కీలకం అంటారు. కొవిడ్ పరిస్థితుల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన నేతల్లో ఒకరిగా బీబీసీ, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు శైలజను గుర్తించడం, కొనియాడడం విశేషం. విజయన్ కేబినెట్లో అత్యుత్తమ మంత్రిగా శైలజ పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి మంత్రికి ఇప్పుడు విజయ్ కొత్త కేబినెట్లో చోటు దక్కకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.
ఇటీవలే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది విజయ్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్. ఫలితాల అనంతరం కొన్ని రోజులకు ఇప్పుడు కొత్తగా మంత్రి వర్గాన్ని ప్రకటించారు విజయన్. ఐతే అందులో శైలజకు చోటు దక్కకపోవడం అందరికీ పెద్ద షాక్. ఆమెను ప్రస్తుతానికి పార్టీ విప్ పదవికి పరిమితం చేశారు. మున్ముందు ఏం జరుగుతుందో తెలియదు. గత ఏఢాది కాలంలో శైలజ పనితీరుకు ముగ్దులైన జనాలు.. ఇటీవలి ఎన్నికల్లో ఆమెకు కుత్తుపరంబ నియోజకవర్గంలో భారీ విజయాన్నందించారు. ఏకంగా 60 వేల మెజారిటీ వచ్చింది శైలజకు. కేరళ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఇది రికార్డు మెజారిటీ కావడం గమనార్హం.
పూర్వాశ్రమంలో టీచర్ అయిన శైలజను ఇప్పటికీ మంత్రిలా కాకుండా టీచర్ లాగే చూస్తారు జనాలు. ఆమెను శైలజా టీచర్ అనే పిలుస్తారు. ఆమె ట్విట్టర్ హ్యాండిల్ పేరు సైతం ‘శైలజా టీచర్’ అనే ఉంటుంది. ఇంత మంచి పేరున్న శైలజకు విజయన్ మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడం అందరికీ పెద్ద షాక్. శైలజ పాపులారిటీ అంతకంతకూ పెరిగిపోతుండటంతో సీఎం భయపడే ఆమెను మంత్రి వర్గం నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది.
This post was last modified on May 18, 2021 6:24 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…