కొవిడ్ నియంత్రణలో, వైరస్ బాధితులకు అత్యవసర సేవలు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా చేతులెత్తేస్తున్న పరిస్థితుల్లో సోనూ సూద్ అనే నటుడు ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసుకుని బాధితులకు అత్యవసర మందులతో పాటు ఆసుపత్రుల్లో బెడ్లు అందిస్తుండటం.. కోట్ల రూపాయల సాయాన్ని ఉచితంగా అందజేస్తుండటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా విమర్శలు, ఒత్తిడి ఎదుర్కొంటున్న మాట వాస్తవం.
అంతర్జాతీయ మీడియా ఆయన్ను దునుమాడేస్తోంది. స్థానిక మీడియాలోనూ విమర్శలు తప్పట్లేదు. ఆయన ఇమేజ్ బాగా దెబ్బ తినేసింది గత కొన్ని రోజుల్లో. ప్రస్తుతం దేశంలో కరోనా కల్లోలానికి ప్రధాన బాధ్యుడిగా ఆయన్నే అందరూ నిందిస్తున్నారు. అదే సమయంలో సోనూ సూద్ పాపులారిటీ రోజు రోజుకూ పెరిగిపోతోంది. నాయకుడంటే సోనూ అని.. అతడితో పోలిస్తే ప్రధాని పదవిలో ఉన్న మోడీ వేస్ట్ అంటూ పోస్టులు కూడా కనిపిస్తున్నాయి సామాజిక మాధ్యమాల్లో.
ఐతే ఇన్నాళ్లూ సోనూ ఏం చేస్తున్నప్పటికీ చూస్తూ ఉండిపోయాయి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వర్గాలు. కానీ మోడీ ఇమేజ్ దెబ్బ తింటున్న సమయంలో సోనూ నేషనల్ హీరో అయిపోతుండటంతో భాజపా మద్దతుదారులు తట్టుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది. సోనూ గురించి బీజేపీ సోషల్ మీడియా పేజీలు, వాట్సాప్ గ్రూపుల్లో నెమ్మదిగా నెగెటివ్ ప్రచారం నడుస్తుండటం గమనార్హం.
సోనూ వెనుక ఉన్నది ఎవరు.. ఇంత సాయం అతనొక్కడే ఎలా చేయగలుగుతున్నాడు..అతడి ఉద్దేశాలేంటి.. రాజకీయాల్లోకి రావడం కోసమే సేవా కార్యక్రమాలు చేస్తున్నాడా… అనే ప్రశ్నలతో పోస్టులు పెడుతున్నారు. అతనో ఫ్రాడ్ అని.. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న స్థాయిలో సేవా కార్యక్రమాలు చేయట్లేదని.. ఫేక్ ప్రచారాలు ఎక్కువైపోయాయనే ఆరోపణలు కూడా గుప్పిస్తున్నారు. ఐతే ఈ తరహా పోస్టులపై నెటిజన్లు మాత్రం దీటుగా బదులిస్తున్నారు. మీరు చేయరు, చేసేవాడి గురించి ప్రతికూల ప్రచారాలు చేస్తారంటూ మండిపడుతున్నారు. మంచి పని చేసేవాళ్లకు దురుద్దేశాలు ఆపాదించడం కరెక్ట్ కాదని.. సోనూ రాజకీయాల్లోకి వచ్చేట్లున్నప్పటికీ ఇప్పుడు అతను చేస్తున్న మంచి పనులను తక్కువ చేయడానికి వీల్లేదని మెజారిటీ జనాలు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on May 15, 2021 6:55 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…