Political News

3 గంటల్లో.. ఒక్క షాపులో.. మూడున్నర కోట్ల మద్యం ఖాళీ


పోయినేడాది లాక్ డౌన్ టైంలో అన్ని దుకాణాల్లాగే వైన్ షాపులూ మూతపడిపోవడంతో మందుబాబులు ఎంత ఇబ్బంది పడిపోయారో తెలిసిందే. దాదాపు రెండు నెలలు మద్యం దొరక్క అల్లాడిపోయారు. చివరికి మద్యం దుకాణాలు తెరుచుకోగానే వాటి మీదికి ఎలా దండెత్తారో చూశాం. ఐతే కొన్నాళ్లకు మామూలు పరిస్థితులు వచ్చాయి. ఇక అప్పట్నుంచి సాధారణంగానే నడుస్తున్నాయి మద్యం దుకాణాలు. కట్ చేస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మెజారిటీ రాష్ట్రాలు లాక్‌డౌన్ బాట పట్టడంతో తెలంగాణ కూడా ఆ దిశగా అడుగులు వేయక తప్పలేదు.

ఐతే బుధవారం నుంచి లాక్ డౌన్ అని వార్త బయటికి రావడం ఆలస్యం.. మందు బాబులు ఒక్కసారిగా మద్యం దుకాణాలపై పడిపోయారు. వచ్చే పది రోజుల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మిగతా దుకాణాల్లాగే వైన్ షాపులు కూడా నడుస్తాయని అంటున్నా సరే.. ఇంకెప్పుడూ మద్యం దొరకదేమో అన్నట్లు వైన్ షాపులను ఊడ్చేశారు.

మంగళవారం మధ్యాహ్నం నుంచి వైన్ షాపుల దగ్గర ఎలా క్యూలైన్లు ఉన్నాయో.. ఒక్కొక్కరు బ్యాగుల్లో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు పెట్టుకుని ఎలా బయటికొస్తూ కనిపించారో మీడియాలో అందరూ చూశారు. మందు బాబుల పైత్యం ఏ స్థాయికి చేరిందనడానికి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో లగ్జరీ బ్రాండ్లకు నెలవైన ‘టానిక్’ అనే భారీ మద్యం దుకాణానికి సంబంధించిన దృశ్యాలే నిదర్శనం. చాలా విశాలమైన ఆ వైన్ షాపులో ఉన్న మద్యం మొత్తం మూడే మూడు గంటల్లో ఖాళీ అయిపోయింది. బాటిళ్లతో నిండుగా ఉన్న ర్యాక్స్ అన్నీ లాక్ డౌన్ ప్రకటన వచ్చాక కొన్ని గంటల్లో ఖాళీ అయిపోయాయి.

ఇక్కడ ఆ మూడు గంటల్లో జరిగిన వ్యాపారం సంగతి తెలిస్తే షాకవ్వక మానరు. ఏకంగా మూడున్నర కోట్ల విలువైన మద్యం ఆ మూడు గంటల్లో అమ్ముడైపోయిందట. తెలుగు రాష్ట్రాల్లో ఒక మద్యం దుకాణానికి సంబంధించి ఇది రికార్డు అయి ఉంటుందనడంలో సందేహం లేదు. ఒక్క దుకాణంలో ఇంత ఆదాయం అంటే.. మొత్తం తెలంగాణలోని వైన్ షాపులన్నీ కలుపుకుంటే లెక్క ఎంత ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమే.

This post was last modified on May 12, 2021 9:05 am

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

1 hour ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

2 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

3 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

7 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

7 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

9 hours ago