Political News

రిజైన్ చేయ్.. జ‌గ‌న్‌.. ట్వీట్ల హోరు..!

పాల‌న‌లో జ‌గ‌న్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని.. క‌రోనా విష‌యంలో స‌రైన విధంగా స్పందించ‌లేద‌ని పేర్కొంటూ.. త‌క్ష‌ణ‌మే సీఎం ప‌ద‌వికి రిజైన్ చేయాల‌ని.. కోరుతూ.. పెద్ద ఎత్తు ట్వీట్లు కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తున్నా యి. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన స‌హా… రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజ‌న్‌.. కొర‌త స‌హా వ్యాక్సిన్ ఇవ్వ‌లేక పోతున్న నేప‌థ్యంలో ఇదేనా ఒక్క ఛాన్స్ అంటూ.. నిల‌దీస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.

ట్విటర్‌లో #ResignJagan హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు 20.5 వేల ట్వీట్లు చేశారు. రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం రుయా ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు లో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ వారంలో ఇటువంటి సంఘటనలు అనంత‌పురం, క‌ర్నూలు స‌హా మరికొన్ని చోట్ల కూడా జరిగాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జ‌గ‌న్‌ నాయకత్వ లోపం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. కోవిడ్-19 రెండో ప్రభంజనం వచ్చినప్పటి నుంచి కనీసం ఒకసారైనా ముఖ్యమంత్రి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌లేద‌ని.. చాలా మంది ప్ర‌శ్నిస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయన బయటకు రావడం లేదని ఆరోపిస్తున్నారు.

  • ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తిరుపతి రుయాలో మరణ మృదంగం మోగిందని ఒక‌రు ఆరోపించారు.
  • తనకు కన్నీళ్ళు ఆగడం లేదని మ‌రొక‌రు ఆవేదన వ్యక్తం చేశారు.
  • ప్రభుత్వం ఇంత బాధ్యతారహితంగా ఎలా వ్యవహరించగలుగుతోందని ప్రశ్నించారు.
  • ప్రభుత్వాన్ని సమర్థించేవారిపై ఒక‌రిద్ద‌రు బూతులు తిట్టారు.
  • ఆంధ్ర ప్రదేశ్ నిజంగా విపత్తులో ఉందని మరొక‌రు ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

కొస‌మెరుపు!

కొన్నాళ్ల కింద‌ట.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపైనా ఇలానే పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో జ‌నాలు.. రాజీనామా చేయాలంటూ.. డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు అంతే సెగ ఇప్పుడు కేవ‌లం ఏపీ సీఎం జ‌గ‌న్‌కే ఎదురు కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on May 11, 2021 7:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

3 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

4 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

5 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

6 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

6 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

6 hours ago