ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యవహారం చూస్తే… పార్టీ అభిమానులు నివ్వెరపోతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్‌ను టార్గెట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండడం మంచిదే అయినా.. క్షేత్ర స్థాయిలో బలంపై అంచనావేసుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రతిపక్షం పాత్ర పోషించినప్పటికీ.. మరోవైపు.. నియోజకవర్గాలపై దృష్టి పెడుతూనే ముందుకు సాగింది. ఏ నియోజకవర్గం లో ఏం జరుగుతోంది? ఏ నేత ఎలా వ్యవహరిస్తున్నారనే విషయంపై నిరంతరం మానిటరింగ్ చేసుకున్న పరిస్థితి వచ్చింది.
అంతేకాదు.. ఎన్నికల సమయానికి అప్పటికప్పుడు కాకుండా.. ఏకంగా ఏడాదిన్నర ముందునుంచే ఎవరిని ఉంచాలి ? ఎవరిని తుంచాలనే విషయంపై పక్కాగా అధ్యయనం చేసింది. ఈ తరహా.. వ్యూహం టీడీపీలో కొరవడుతోందని అంటున్నారు పరిశీలకులు. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గాన్ని చూస్తే.. ఇది ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. గౌతు ఫ్యామిలీ ఇక్కడ నుంచి పదిసార్లు గెలిచింది. అంటే ఐదారు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో ఆ ఫ్యామిలీకి ప్రజలు ఎంతలా పట్టం కట్టారో తెలుస్తోంది.
గత టర్మ్‌లో ఇక్కడ శివాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే సమయంలో జిల్లా పార్టీ ఇంచార్జ్‌గా శివాజీ కుమార్తె గౌతు శిరీష వ్యవహరించారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చారు. అయితే.. ఆమె ఓడిపోయారు. అయితే.. దీనికి సొంత కేడర్ సహకరించకపోవడం వల్లే.. తాను ఓడిపోయానని.. కొన్నాళ్లుగా ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారు. పోనీ.. పార్టీలో ఉన్న కీలక నేతలైనా.. ఆమెను ఓదార్చి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే అది కూడా కనిపించడం లేదు. దీంతో ఇక్కడ నుంచి గెలిచి.. మంత్రి పదవి చేపట్టిన.. సీదిరి అప్పలరాజు.. తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇక్కడ టీడీపీ కేడర్‌ను కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పైగా అప్పలరాజు మంత్రిగా ఉండడంతో టీడీపీ నేతలు చాలా మంది .. ఆయనకు అనుకూలంగా మారి.. లోపాయికారీ ఒప్పందం చేసుకుని.. పనులు కూడా చేయించుకుంటున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక శిరీష ఫ్యామిలీతో పాటు స్థానికంగా కంటే వైజాగ్‌లో ఉండేందుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అంటున్నారు. దీంతో టీడీపీ కేడర్లో ధైర్యం సన్నగిల్లుతోన్న పరిస్థితి. మరి పలాస టీడీపీని ఎప్పటకి ఎవరు గాడిలో పెడతారో ? చూడాలి.
This post was last modified on May 13, 2021 8:21 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…