పవిత్ర గంగా నదికి కూడా కరోనా సోకిందా? హిందూ సామాజిక వర్గాలు.. అత్యంత పవిత్రంగా భావించే గంగానది నీరు కూడా ఇప్పుడు నిరుపయోగంగా అత్యంత ప్రమాదకరంగా మారిపోయిందా? అంటే.. ఔననే అంటున్నారు ఉత్తరప్రదేశ్ మునిసిపాలిటీ అధికారులు. గంగా నది ప్రవాహం ఎక్కువగా ఉన్న యూపీలో ఇప్పుడు గంగా నదికి కూడా కరోనా ప్రభావం సోకిందనే ప్రచారం.. తీవ్ర కలకలం రేపుతోంది. వారణాసి సహా అనే ప్రాంతాల్లో ప్రవహించే గంగా నది నీటిని.. యూపీలో జనావాసాలకు కూడా సరఫరా చేస్తారు.
ఈ నీటినే తాగేందుకు, సాగుకు కూడా వినియోగిస్తారు. అయితే.. ఇప్పుడు తాజాగా ఈ గంగా నదికి కూడా కరోనా వచ్చిందని సోషల్ మీడియాలో జోరు ప్రచారం సాగుతుండగా.. అధికారులు దీనిని ఇంకా నిర్ధారించ లేదని.. అయితే.. ప్రమాదం మాత్రం పొంచి ఉందని అంటున్నారు. దీనికి కారణాలపై వారు దృష్టి పెట్టారు. అయితే.. ఇప్పటికిప్పుడు అందిన సమాచారం ప్రకారం.. యూపీ, బిహార్‌లో ప్రవహించే గంగా నదికి ఒక ప్రత్యేకత ఉంది. ఆరు ముక్తి ధామాల్లో గంగా నది కూడా ఒకటి.
అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతిక అని ఆరు ముక్తి ధామాలను శాస్త్రాలు పేర్కొంటున్నాయి. వీటిలో మరణించడం కానీ, మరణించిన వారి మృతదేహాలకు ఈ ఆరు ప్రదేశాల్లో ఎక్కడైనా అంతిమ సం స్కారం చేయడం వల్ల కానీ.. ముక్తి లభిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలోనే ఇటీవల 15 రోజులుగా యూపీలో కరోనా కారణంగా మృతి చెందిన వారి భౌతిక దేహాలను గంగా నదిలో గుట్టు చప్పుడు కాకుండా కలిపేస్తున్నారు. ఎలాంటి హడావుడి లేకుండానే సాగుతున్న ఈ క్రతువులపై అక్కడి యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం నిషేధం విధించింది.
అయితే.. తాజాగా ఇప్పుడు గంగా నది ఒడ్డుకు.. 50 మృత దేహాలు కొట్టుకు వచ్చాయి. బిహార్లోని బక్సర్ జిల్లాలో జరిగిన ఈఘటన తీవ్ర కలకలం రేగింది. గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మహాదేవ్ ఘాట్ సమీపంలో ఒక్క కిలోమీటరు పరిధిలోనే 48 శవాలు కనిపించాయి. చాలా మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. ఒడ్డుకు కొట్టుకొచ్చిన శరీరభాగాలను కుక్కలు పీక్కుతిన్నాయి.
కరోనాతో చనిపోయినవారిని తమ బంధువులే ఇలా గంగా నదిలో పడేశారని సమాచారం అందడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. గంగా నది నీటి శాంపిళ్లను ప్రయోగశాలలకు పంపించారు. తాము హెచ్చరించేవరకు ఎవరూ గంగానది నీటిని తాగొద్దని బిహార్, యూపీ ప్రభుత్వం ప్రకటించాయి. మరి గంగా నది కూడా అపవిత్రం అయిపోయిందా? కరోనా సోకిందా? చూడాలి ఏం జరుగుతుందో.
This post was last modified on May 10, 2021 4:33 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…