రాజకీయాల్లో ఆవేశం మాత్రమే కాదు.. ఆలోచన కూడా ఉండాలని అంటారు.. అనుభవజ్ఞులు. కానీ, బీజేపీ విషయంలో ఎప్పుడూ కూడా ఆవేశమే తప్ప.. ఆలోచన ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ పరిస్థితిని అంచనా వేసుకుని ముందుకు సాగాల్సిన నాయకులు.. పార్టీని అభివృద్ధి చేసుకోవాల్సిన నేతలు.. కర్ర విడిచి సాము చేసుకున్న ఫలితంగా .. ఇప్పుడు పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని అంటున్నారు పరిశీలకులు. ఒక్కసారి.. మూడు మాసాల కిందటకు వెళ్తే.. “రాబోయే రోజుల్లో పార్టీ డెవలప్ అవుతుందని.. ఉదయించే సూర్యుడిని అడ్డుకోవడం.. ఎవరి వల్లా కాదు!” అనే కామెంట్లు వినిపించాయి.
దీంతో ఇటు టీడీపీ కానీ, అటు వైసీపీ కానీ.. మరో పార్టీ కానీ.. తమకు ప్రాధాన్యం లేదని .. భావించిన నాయకులు.. తటస్థ నేతలు కూడా తమకు ప్రత్యామ్నాయంగా.. ఒక పార్టీ లభించిందని భావించారు. ఈ క్రమంలోనే కొందరు కీలక నేతలతో మంతనాలు కూడా చేసుకున్నారు. పదవుల కోసం కూడా పాకులాడారు. జిల్లాల్లో తమదే పైచేయి అయితే.. బాగుండు! అనే దిశగా కూడా ఆలోచన చేశారు. అయితే.. తిరుపతి ఉప ఎన్నిక రావడంతో ఇలా.. తటస్థులు.. ఇతర పార్టీల్లోని అసంతృప్తులతో నిండిపోతుందని ఊహించిన బీజేపీకి పెద్ద పరీక్షే ఎదురైంది.
తిరుపతిలో రిజల్ట్ చూసుకుని.. పార్టీలో చేరదామని.. సదరు కురువృద్ధులు, తటస్థులు.. అసంతృప్తులు వంటివారు అనుకున్నారు. దీంతో సోము సహా చాలా మంది నాయకులు తిరుపతి పోరు తర్వాత.. పార్టీ కిక్కిరిసిపోతుందని.. పార్టీలో ఇంక నేతలకు కొదవ ఉండదని భావించారు. కానీ, పరిస్థితి యూటర్న్ తీసుకుని.. తిరుపతిలో పార్టీ తిప్పలు పడింది. మాజీ ఐఏఎస్ రత్నప్రభ లాంటి వారిని బతిమిలాడి మరీ పోటీ పెట్టినా కూడా పార్టీకి డిపాజిట్లు రాలేదు. పైగా అటు సాగర్లోనూ 6 వేల ఓట్లకు మించి రాలేదు.
ఇక తిరుపతి ఫలితం తర్వాత.. అప్పటి వరకు సోముకు పక్కనే ఉన్న కొందరు నేతలు కూడా ఇప్పుడు కనుమరుగయ్యారు. ఇక, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆ పార్టీ వద్దులే
అనే టాక్ కూడా వినిపిస్తుండడం గమనార్హం. మరి ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ పుంజుకునేదెప్పుడు.. అధికారంలోకి వచ్చేదెప్పుడు ? అన్న ప్రశ్నలకు ఆన్సర్ ఎన్నేళ్లకు లభిస్తుందో ? కూడా తెలియని దుస్థితి..!
This post was last modified on May 13, 2021 7:29 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…