మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్‌పై డి.హీరేహల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పై ట్విటర్‌లో ఆరోపణలు చేసిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ నేత భోజరాజు నాయక్ ఫిర్యాదు చేశారు. వివరాలు… టీడీపీ కార్యకర్త మారుతిపై కర్ణాటకలో కొందరు వ్యక్తులు దాడి చేశారు. అయితే, దీని వెనుక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఉన్నారంటూ.. నారా లోకేశ్ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. వెంటనే స్పందించిన భోజరాజు నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో పోలీసులు.. హుటాహుటిన ఆగమేఘాలపై స్పందించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గౌరవానికి భంగం కలిగించారని నారా లోకేశ్‌పై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు.. అదికార పార్టీకి కూడా నష్టం కలిగించేందుకు కుట్ర పన్నినట్లు అభియోగాలు మోపారు. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ కేసు నమోదుపై.. టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు బనాయించే అక్రమ కేసులకు భయపడేది లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. అధికార పార్టీ నాయకులు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
కాపు రామచంద్రారెడ్డి ప్రోద్బలంతోనే మారుతిపై జరిగిన దాడిని లోకేశ్ ఖండిస్తే, ఆయనపై అక్రమ కేసు పెట్టారని కాల్వ ఆరోపించారు. రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి నాయకత్వంలో ముఠాగా ఏర్పడి యథేచ్ఛగా వనరులను కొల్లగొడుతున్నా రని మండిపడ్డారు. దుర్మార్గాలను ప్రశ్నిస్తే, దాడులు చేసి అక్రమ కేసుల్లో ఇరికించడం అధికార పార్టీకి పరిపాటిగా మారిందని విమర్శించారు. డి.హీరేహాళ్ మండలంలో వైసీపీ నాయకుల దోపిడీని త్వరలోనే ప్రజలముందు పెడతామని ఆయన చెప్పారు. తప్పుడు కేసులను తిప్పికొడుతూనే దొంగల ముఠా అవినీతిని ఎండగడతామని హెచ్చరించారు.
లోకేష్ రియాక్షన్ ఇదీ..
తనపై నమోదు చేసిన కేసు విషయంలో నారా లోకేష్ ట్విట్టర్‌లో దీటుగా స్పందించారు.
This post was last modified on May 9, 2021 9:22 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…