రాజకీయాల రూపురేఖలు మారిపోయాయి. సందర్భం ఏదైనా సరే.. ఏదో ఒక ట్విస్టు ఇవ్వకపోతే మనసు అస్సలు ఊరుకోని పరిస్థితి. ప్రత్యేక సందర్భాల్లో తెలిపే శుభాకాంక్షల్లోనూ ఏదో ఒక ట్విస్టు ఇవ్వటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. మిగిలిన సమయాల్లో రాజకీయాన్ని చేసే నేతలు.. ప్రత్యేక సందర్భాల్లోనూ అదే తీరును ప్రదర్శించటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇందుకు నిదర్శనంగా వైఎస్ షర్మిల ఉదంతాన్ని చెప్పాలి. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితం ఆదివారం వెలువడటం తెలిసిందే. ముందుగా ఊహించిన రీతిలోనే టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన షర్మిల.. తనదైన పంచ్ ను కేసీఆర్ కు వేసే ప్రయత్నం చేశారు.
‘ఉధృతంగా ఉన్న కరోనా సెకండ్‌వేవ్ వ్యాప్తిని సైతం లెక్కచేయకుండా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో విజయాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్‌కు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేయటమే ఇందుకు నిదర్శనం. ఇక్కడితో ఆగితే షర్మిల గురించి స్పెషల్ గా చెప్పుకోవాల్సిన పని లేదు. తానుచేసిన ట్వీట్ కు అంతో ఇంతో రాజకీయ ప్రయోజనం లభించాలన్న ధోరణితో ఆమె మరో అంశాన్ని ప్రస్తావించారు. ఇలాంటి ఆనందకరమైన సమయంలో అయినా కరోనాను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని తాను కోరుకున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి ఏదో విధంగా తన ఎజెండాను తెర మీదకు తీసుకొచ్చేందుకు షర్మిల ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.
This post was last modified on May 3, 2021 11:29 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…