2014 ఎన్నికల ముందు మోడీ ఒక విచిత్రమైన ప్రతిపాదన చేశాడు గుర్తుందా? విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ అంతా పట్టుకొస్తా, ప్రతి ఒక్కరి అక్కౌంట్లో 15 వేలు వేయొచ్చు అలా చేస్తే. బ్లాకాసురుల భరతం పడతా అన్నాడు. ఆ తర్వాత దానికథే మరిచిపోయాడు మోడీ.
బ్లాకాసురుల సంగతి పక్కన పెడితే… మోడీ అందరికీ 15 వేలు అక్కౌంట్లో వేయడానికే 20 లక్షల కోట్లు ప్రకటించాడు అని చెబుతున్నారు. దీనిపై మీమ్స్ కూడా వదుల్తున్నారు జనం. కొందరైతే 20000000000000 (2 పక్కన 13 సున్నాలు) 130 కోట్ల జనాభాతో డివైడిడ్ బై చేసి… అరెరె మనందరి అక్కౌంట్లలో తాను గతంలో చెప్పినట్లు 15 వేలు వేయడానికి సరిగ్గా లెక్కేసుకుని ఈ ప్యాకేజీ ప్రకటించారు అని సెటైర్స్ వేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా రంగాలకు ప్రయోజనం కలిగించేలా ప్యాకేజీ ప్రకటించినా అది ఎవరి చేతుల్లోకి వెళ్తుందో… దానికంటే దేశ ప్రజల ఖాతాలో వేసేయండి మోడీ గారు అని రిక్వెస్టులు పెడుతున్నారు.
మోడీ సర్కారు అలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందంటారు? మీకు హ్యాపీయేనా… కాదా? చెప్పండి మిమ్మల్నే అడిగేది 🙂
This post was last modified on May 13, 2020 5:14 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…