దేశంలో కరోనా సెకండ్ వేవ్‌తో ప్రజలు అల్లాడిపోతున్నారు. దేశంలోని మేధావులు, ప్రపంచ స్థాయి విశ్లేషకులు కూడా.. భారత్‌లో ఈ రేంజ్‌లో కరోనా వ్యాప్తి చెందడానికి ప్రధాన మంత్రి మోడీ విధానాలే కారణమని చెబుతున్నారు. అదేసమయంలో దేశంలోనూ అంతే వ్యతిరేకత ఉందని లోకల్ మీడియా కూడా చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం సరైన దిశగా నిర్ణయాలు తీసుకోకపోవడం.. లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటి విషయాల్లో రాష్ట్రాలను దిశానిర్దేశం చేయలేక పోవడం.. ఆర్థికంగా రాష్ట్రాలకు భరోసా కల్పించకపోవడం.. వంటి కీలక పరిణామాలు.. కరోనాను పెంచిపోషించాయనేది నిర్వివాదాంశం.
అయితే.. ఘనత వహించిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఈ సమయంలో రాజ్యాంగం.. బాధ్యతలు గుర్తుకు వచ్చాయి. “ప్రజారోగ్యం అనేది రాష్ట్రాల సబ్జెక్టు! రాష్ట్రాలకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. సో.. కేంద్రంపై విమర్శలు చేసే వారు రాజ్యాంగంలోని ‘సబ్జెక్టు’లను(అంటే.. కేంద్ర, రాష్ట్రాల బాధ్యతలను విశదీకరించే ఆర్టికల్స్) చదువుకోవాలని అని హితవు పలికారు. ఇంతకీ ఆయన బాధ.. ఇంత మంది ప్రజలు చనిపోతున్నారని కాదు.. మోడీని తిట్టిపోస్తున్నారనే!!
పోనీ.. సోము చెప్పిన విషయాన్నే ఒకసారి పరిశీలిస్తే.. ప్రజారోగ్యం అనేది రాజ్యాంగంలో కేవలం రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది కాదని అంటున్నారు పరిశీలకులు. ప్రజారోగ్యం రాజ్యాంగంలో కేంద్ర సబ్జెక్టులో కూడా ఉందని 1897 ప్యాండమిక్ చట్టం.. కేంద్రానికి కొన్ని బాధ్యతలను దఖలు పరిచింది. అందుకే గత ఏడాది లాక్‌డౌన్ విధించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్నే ఉదహరించింది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రాలకే బాధ్యత అని తప్పించుకునేందుకు అవకాశం లేదు. అదే సమయంలో ఇలాంటి ‘ప్రజారోగ్య విపత్తు’లు సంభవించినప్పుడు.. ఖచ్చితంగా కేంద్రానికే ఎక్కువగా బాధ్యత ఉంటుంది.
కానీ, ఈ విషయంలో కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకుంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. కేంద్రానికి కూడా ఈ విషయం తెలుసు. అందుకే.. మౌనంగా ఉంటోంది. అంతేకాదు.. ఎవరూ ఈ విషయంపై స్పందించరాదని.. మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో నోరేసుకుని పడిపోయే నాయకులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కానీ, సోము వారు మాత్రం తప్పు మోడీది కాదు.. అంతా రాష్ట్రాలదే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎంత వరకు సబబు! అనేది నిపుణుల మాట.
This post was last modified on May 1, 2021 9:41 am
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…