పార్టీలో ఇపుడందరి చూపులు జగన్ పేనే ఉంది. ఎందుకంటే అధికారంలోకి రాగానే నిర్వహించాలని అనుకున్న పార్టీ ప్లీనరీ నిర్వహణ విషయం ఇపుడు సందిగ్దంలో పడింది. అధికారంలోకి రాగానే పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని ప్రతిపక్షంలో ఉన్నపుడే జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అనుకున్న ప్రకారమైతే 2020, జూలై 8వ తేదీన నాలుగో ప్లీనరీ ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేసుకోక తప్పలేదు.
సరే అప్పుడంటే వాయిదా వేసుకోక తప్పలేదు 2021 జూలై లో అయినా ప్లీనరీని ఘనంగా నిర్వహించాల్సిందే అని అనుకున్నారు. తీరా ఇపుడు జూలై సమయం వచ్చేటప్పటికి మళ్ళీ కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వణికించేస్తోంది. జూలై అంటే ఇకా మూడు నెలలుంది. అయితే ఇఫ్పటికైతే కరోనా వైరస్ కేసులు చాలా ఉదృతంగా ఉందన్నది వాస్తవం. మరి ఈ ఉదృతి ఎంతకాలం కంటిన్యు అవుతుందో ఎవరు చెప్పలేకున్నారు.
ఒకవేళ ఇపుడు ప్రభావం తగ్గినా మళ్ళీ మే నెల 3వ వారంలో థర్డ్ వేవ్ మరింత ఉదృతంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికన్నా మరింత ఉదృతంగా మే నెల చివరలో వస్తుందని అనుకుంటున్న కరోనా మహమ్మారి ఎంత కాలం ఉంటుందో ? ఏ స్ధాయిలో అల్లకల్లోలం సృష్టిస్తుందో తలచుకుంటేనే భయమేస్తోంది.
ఇలాంటి పరిస్దితుల్లో జూలై 8 వ తేదీన పార్టీ ప్లీనరీ నిర్వహణ అనుమానమే అని సీనియర్ నేతలు తెగ బాధపడిపోతున్నారు. ఒకవేళ ప్లీనరీని నిర్వహించాలని జగన్ డిసైడ్ చేస్తే వేలాదిమంది నేతలు రెండురోజుల పాటు ఒకేచోట గుమిగూడటం తప్పదు. చివరగా నిర్వహించబోయే బహిరంగసభకు లక్షల మందిని సమీకరిస్తారు. దాంతో వైరస్ ఒక్కసారిగా పెరిగిపోయే ప్రమాదముంది.
అధికారపార్టీ నిర్వహించిన ప్లీనరీ వల్లే కరోనా వైరస్ వ్యాపించిందనే ఆరోపణలను, నిందను జగన్ భరించాల్సుంటుంది. ప్లీనరీ నిర్వహణ విషయంలో అధికారిక నిర్ణయం తీసుకుంటే ఎవరైనా కోర్టుకెక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టే ప్లీనరీ విషయంలో జగన్ ఏమి నిర్ణయం తీసుకుంటారా అని నేతలు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on April 29, 2021 4:18 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…