దేశంలో కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో విజృంభించింది. ఎక్కడికక్కడ కరోనా బాధితులతో దేశం అల్లాడి పోతోంది. ప్రపంచంలో ఇప్పుడు కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశం.. కేవలం భారతే. ఒకప్పుడు కరోనాపై తీవ్రస్థాయిలో యుద్ధం చేశామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేతులు ఎత్తేసింది. అయితే.. రెండో దశ కరోనా వ్యాప్తికి కారణం ఎవరు? అనే విషయంపై ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వాలు మౌనంగా ఉన్నాయి. గతంలో అయితే.. చైనా నుంచి వచ్చిన వారు.. తబ్లిగీ సమావేశాల ద్వారా వ్యాపించిందని చెప్పారు.
కానీ, సెకండ్ వేవ్‌పై మాత్రం ఎవరికి వారు మౌనంగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు సంచల న వ్యాఖ్యలు చేసింది. కరోనా రెండో దశవ్యాప్తికి కేంద్ర ఎన్నికల సంఘమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసిం ది. దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘమే కరోనా వ్యాప్తికి.. ఇన్ని వేల మంది ప్రాణా లు పోవడానికి కారణంమని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. ఎన్నికల ర్యాలీలను, బహిరంగ సభలను నిలువరించడంలోను, నియంత్రించడంలోను పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం విఫలమైందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
దేశంలో ఇన్ని లక్షల మంది .. మరణాలకు కారణమైన ఎన్నికల సంఘం అధికారులపై హత్యా నేరం కింది సెక్షన్ 302 ఐపీసీ కింద కేసులు ఎందుకుపెట్టకూడదో వివరణ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఇక, మే 2 న ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కరోనా నిబంధనలు పాటించకపోతే.. పూర్తిగా ఎన్నికలనే రద్దు చేస్తామని.. కూడా మద్రాస్ హైకోర్టు హెచ్చరించింది. అంతేకాదు.. ప్రజల ప్రాణాలకు మద్దతు తెలపాల్సిన నాయకులు సైతం ఎలాంటి రక్షణలు తీసుకోకుండానే ప్రచారంలో పాల్గొన్నారని.. వారు కూడా కరోనా మరణాలకు బాధ్యులలేనని వ్యాఖ్యానించింది. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై స్టే ఇవ్వాలంటూ.. దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విచారణలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
This post was last modified on April 26, 2021 2:29 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…