దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవాన్ని చూస్తున్నాం. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు తీవ్రత చాలా ఎక్కువ అన్నది స్పష్టం. ఒకప్పుడు రోజుకు గరిష్టంగా లక్ష కేసులు వస్తేనే గుండెలు బాదేసుకున్నాం. కానీ ఇప్పుడు రోజువారీ కేసులు 4 లక్షలకు చేరువగా ఉన్నాయి. రోజూ వేల సంఖ్యలోనే రోగులు ప్రాణాలు వదులతున్నారు. ప్రభుత్వాలు మరణాల విషయంలో సరైన డేటా ఇవ్వకపోవడం వల్ల కొందరికి తీవ్రత అర్థం కాక పోతుండొచ్చు.
ఈ సమయంలో మనిషి ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే. ముఖ్యంగా విద్యార్థుల పరీక్షల విషయంలో గత ఏడాది లాగే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు దిగి వస్తున్నాయి. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. తెలంగాణ సైతం పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, అంతర్గత పరీక్షల ఆధారంగా వారిని ప్రమోట్ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. మాత్రం పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించబోతున్నారు. తొమ్మిదో తరగతి వరకు స్కూళ్లన్నీ మూసి వేయించి టెన్త్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు ఉంటాయని ప్రకటించడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ నిర్ణయం పట్ల ఎవరూ సంతృప్తిగా లేరు. పిల్లల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదంటున్న తల్లిదండ్రులు ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. అయినా సరే.. జగన్ సర్కారు వెనక్కి తగ్గకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పటితో పోలిస్తే తీవ్రత బాగా పెరిగింది.
అమరావతిలో ముఖ్యమంత్రి రోజూ విధుల కోసం వెళ్లే సచివాలయంలో గత కొన్ని రోజుల్లో ఐదుగురు ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు వదలడం గమనార్హం. తాను పని చేస్తున్న చోట పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉన్నపుడు జగన్ పదో తరగతి విద్యార్థుల పరీక్షల విషయంలో అంత మొండిగా ఉండటం విడ్డూరం. ప్రతిపక్షాలకు ఇది ఆయుధంగా మారే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కారు నిర్ణయం మార్చుకోక తప్పేలా లేదు.
This post was last modified on April 26, 2021 8:16 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…