రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పదే పదే వ్యాఖ్యలు సంధిస్తున్న బీజేపీ నేతలకు ఎక్కడికక్కడ ఎదుర వుతున్న వర్గ పోరు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పగ్గాలు చేపట్టిన తర్వాత.. పార్టీలో అనేక మార్పులు తీసుకువచ్చారు. ప్రక్షాళన పేరుతో.. రాజకీయంగా దూకుడు గా ఉన్న నేతలను సైలెంట్ చేశారు. అదే సయమంలో ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇలా వచ్చిన వారికి బ్యాక్ గ్రౌండ్ ఉందా? లేదా? లేక.. నేతలకు ప్రజాబలం ఎంత ఉంది? అనే ఈక్వేషన్లు వేసుకోవడం మరిచిపోయి.. వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీలో చేర్చుకున్నారు.
ఇంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే.. ఇలా వచ్చిన కొత్త వారికి సోము వీర్రాజు.. ప్రోత్సహిస్తు న్నాను అని చెప్పుకొనేందుకు.. వారికి కీలక పదవులు అప్పగించారు. అప్పటి వరకు ఉన్న సీనియర్లను సైతం పక్కన పెట్టి.. కొత్త వారికి అవకాశం కల్పించారు. దీంతో పార్టీలో నేతలు ఎవరికి వారు సోము వీర్రాజు నిర్ణయాలను వ్యతిరేకించడం ప్రారంభించారు. విజయనగరం నుంచి అనంతపురం వరకు ఇలాంటి పరిస్థితే కొనసాగింది.
పార్టీ అధినేత చెప్పిందే వేదం అనే విధంగా సోము వ్యవహరిస్తుండడంతో సీనియర్లు మౌనం పాటిస్తున్నారు. కొన్ని చోట్ల పార్టీ కార్యక్రమాలకు కూడా దూరం అవుతున్నారు. ఫలితంగా పార్టీలో ఐక్యత ఎక్కడా కనిపించడం లేదు. మేం పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని పక్కన పెట్టడం ఎంత వరకు సమంజసం
అనే మాట సర్వత్రా వినిపిస్తోంది. అంతేకాదు.. పలు జిల్లాల్లో వర్గాలుగా విడిపోయి.. సొంత రాజకీయాలు చేసుకుంటున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.
ఈ ఎఫెక్ట్ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల సమయంలోనూ బీజేపీకి గట్టిగానే తగిలింది. ఎవరూ కలిసి రాలేదు. ఈ కారణంగానే స్థానిక ఎన్నికల్లో సత్తా చూపిస్తుందనే అంచనాలు వేసుకున్నా.. పార్టీ ఎక్కడా పుంజుకోలేదు. ఈ తరహా పరిణామాలు వద్దని.. బూత్ లెవెల్ కమిటీలు వేయాలని పార్టీ అధిష్టానం నుంచి కూడా పలుమార్లు సూచనలు వస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా పార్టీ దెబ్బతింటోంది. మరి ఇప్పటికైనా.. సోము వీర్రాజు.. అందరినీ కలుపుకొని వెళ్తారో లేదో చూడాలి.
This post was last modified on April 25, 2021 12:57 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…