“ప్రస్తుత పరిణామాలు ఏమాత్రం బాగోలేదు. మనమే సర్దుకు పోవాలి!”-ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి స్థానిక నేతలకు.. అందుతున్న సమాచారం. ఆయన నేరుగా చెప్పలేక పోయినా.. కీలక నేతల ద్వారా ఆయన మనసులో మాట చెప్పిస్తున్నారు. దీనికి కారణం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నేతలపై వైసీపీ సర్కారు వివిధ రూపాల్లో కేసులు నమోదు చేసింది. అదే సమయంలో ఆర్థికంగా కూడా వారి వ్యాపారాలను దెబ్బతీస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ మారాలని.. లేకపోతే.. ఇబ్బందులు తప్పవని ఒత్తిళ్లు కూడా వస్తున్నాయని వారు వాపోతున్నారు..
ఈ క్రమంలో ఏదైనా చేయాలంటూ.. పార్టీ సీనియర్లకు విన్నవిస్తున్నారు. దీంతో వారంతా కూడా అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరి విషయంలో స్పందిస్తున్నా.. మరికొందరి విషయాల్లో చంద్రబాబు స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం సర్దుకు పోవాలని.. త్వరలోనే మార్పు వస్తుందని.. ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కీలక నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. బాధల్లో ఉన్నవారిని ఊరడిస్తున్నారు. అయితే. వారు ఈ ఊరడింపులు కోరుకోవడం లేదు.
తమకు ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయంగా ఏదైనా మార్గం చూపించాలని అడుగుతున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి వంటి చోట గెలిస్తే.. పార్టీ తలెత్తుకుని పోరాడేందుకు అవకాశం ఉంటుందని బావించిన చంద్రబాబు అక్కడ తనే రంగంలోకి దిగారు. కానీ, ఫలితంపై మాత్రం ఊగిసలాట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఏమీ చేసే పరిస్థితి లేదని.. సీనియర్లు కూడా చెప్పేస్తున్నారు. అయితే.. ఇలా నిర్బంధాలు ఎదుర్కొంటున్నవారిలో ఎక్కువ మంది మాజీ ఎమ్మెల్యేల అనుచరులు ఉండడం గమనార్హం.
పోనీ.. ఆ మాజీలైనా అందుబాటులో ఉన్నారా ? అంటే.. వారు కూడా తలకో దిక్కూ వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు పార్టీ మారడమా ? లేక.. వైసీపీ అధికారంలో ఉన్నంత సేపు మౌనంగా ఉండడమా ? అని నిర్ణయించుకుంటున్నారు. ఏదేమైనా.. టీడీపీలో అతిపెద్ద పెను సవాలుగా మారిన ఈ విషయాన్ని చంద్రబాబు సీరియస్‌గానే తీసుకున్నా.. ఇప్పటికిప్పుడు వారిని ఒడ్డెక్కించే ప్రయత్నం మాత్రం చేయలేక పోతుండడం గమనార్హం. ఇదే అలుసును కనిపెట్టిన వైసీపీ నేతలు మరింతగా రెచ్చిపోతున్నారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
This post was last modified on April 22, 2021 10:52 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…