Political News

ఇక టీడీపీ ఎమ్మెల్యేలు గ‌ప్‌చుప్ అయిపోతారా ?


స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. టీడీపీలో ఒక చిత్ర‌మైన విష‌యం హ‌ల్‌చ‌ల్‌చేస్తోంది. వైసీపీలోనేమో.. ఇంకేముంది.. టీడీపీ ఖాళీ అయిపోతుంది.. అంద‌రూ వ‌చ్చి త‌మ పార్టీలో చేరిపోతున్నారు.. దీంతో టీడీపీ ఖాళీ అయిపోతుంది..! అని ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో వైసీపీ చెబుతున్న‌, లేదా నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు.. ప‌క్క‌న పెడితే.. టీడీపీలోనే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఉన్న‌ప్ప‌టికీ.. గ‌తంలో ఉన్న దూకుడు మాత్రం ఉండే అవ‌కాశం లేద‌ని అంటున్నారు రాజ‌కీయ‌ ప‌రిశీల‌కులు. ఏపీలో దాదాపు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ వైసీపీ దూకుడు ఎక్కువ‌గా ఉంది.

స్థానిక ఎన్నిక‌ల్లోనూ.. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ వైసీపీ వ‌న్‌సైడ్‌గా విజ‌యం సాధించిన ద‌రిమిలా… అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వారి పెత్త‌న‌మే ఎక్కువ‌గా ఉంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల‌కు వాయిస్ ఉండ‌డం లేదు. నిజానికి తిరుప‌తి ఉప ఎన్నిక సంద‌ర్భంగా కూడా చాలా మంది నాయ‌కులు ముందుకు రాలేదు. చంద్ర‌బాబు మౌఖిక ఆదేశాలు ఇచ్చినా.. కూడా నేత‌లు ముందుకు రాలేదు. పైగా.. ఎవ‌రూ పార్టీ గురించి కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. పోనీ.. దూకుడుగా ముందుకు వ‌చ్చినప్ప‌టికీ.. అధికార పార్టీ నేత‌ల నుంచి తీవ్ర‌మైన ఒత్తిళ్లు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో ఏదో కార‌ణంతో కేసు న‌మోదు చేస్తున్నారు.

పోనీ.. ఈ స‌మ‌యంలో అయినా.. నేత‌లకు పార్టీ అండ‌గా నిలుస్తోందా? అంటే.. అది కూడా లేదు. ఇటీవ‌ల దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ స‌న్నిహితులు ఇదే విష‌యాన్ని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం పోరాడుతున్నాం.. కేసులు పెడుతున్నారు.. పార్టీ క‌నీసం బెయిల్ ఇప్పించే ప్ర‌య‌త్నాలు కూడా చేయ‌డం లేదు. దీంతో మౌనంగా ఉంటే పోలా.. అని అనుకుంటున్నాం. అని వారు చెప్పారు.

ఇక‌, ఇదే ప‌రిస్థితి గెలిచిన నాయ‌కులకు కూడా ఉంది. వారు వ్యాపారాలు, వ్య‌వ‌హారాల్లో త‌ల‌మునక‌లైన నేప‌థ్యంలో గ‌ళం విప్పితే.. తంటాలు వ‌స్తాయ‌ని భావించి.. మౌనంగానే ఉండిపోతున్నారు. సో.. ఈ ప‌రిస్థితి తిరుప‌తి రిజ‌ల్ట్ త‌ర్వాత‌.. మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌రి ఈ ప‌రిస్థితిని త‌ట్టుకుని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.

This post was last modified on April 21, 2021 11:38 am

Share
Show comments
Published by
satya

Recent Posts

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

13 mins ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

52 mins ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

1 hour ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

2 hours ago

ఇదేం ట్విస్ట్ వీరమల్లూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…

3 hours ago

IPL దెబ్బకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా

థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…

4 hours ago