‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్‌మెంట్ మొదటి విడత నగదును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. అయితే.. ఈ నిధుల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన సొమ్ములు ఏమైనా ఉన్నాయా? అంటే.. లేవు. వివిధ సామాజిక వర్గాల సంక్షేమం కోసం.. కేటాయించే నిధులనే గుండుగుత్తుగా చూపించి.. వీటినే విద్యాదీవెన కింద విడుదల చేయడం సీఎం జగన్ తెలివి తేటలకు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
కాగా, విద్వాదీవెన ప్రారంభింస్తూ.. సీఎం ఏమన్నారంటే.. విద్యా దీవెన ద్వారా 10.88లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుతుందన్నారు. “2018-19లో బకాయిలు ఉన్న రూ.1800 కోట్లను మన ప్రభుత్వమే చెల్లించింది. 2019-20 ఏడాదికి పూర్తి రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు లేకుండా చేశాం. ఏ ఏడాది ఫీజు రియింబర్స్‌మెంట్‌ను అదే ఏడాదిలో చెల్లిస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తున్నాం” అన్నారు.
ఈ సారి .. ప్రతి త్రైమాసికంలో నేరుగా తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని సీఎం చెప్పారు. అంగన్ వాడీ కేంద్రాలను ప్రీప్రైమరీలుగా మార్చామని, నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చుతున్నామని, పిల్లల ప్రతి అడుగులో ప్రభుత్వం తోడుగా ఉందని వెల్లడించారు. పిల్లల తల్లులకు ప్రభుత్వం తరఫున లేఖలు కూడా రాశామని, వసతి దీవెన కూడా ఎప్పుడు ఇస్తామన్నది లేఖలో రాశామని సీఎం జగన్ పేర్కొన్నారు. మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
ఇవీ.. నిధులు..
This post was last modified on April 19, 2021 3:07 pm
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…