కీలక శాఖ కాకపోయినా.. వైసీపీ సర్కారులో ఆయన కీలక నేత, కీలక మంత్రి కూడా..! నిత్యం మీడియా మీటింగులు పెట్టి ప్రతి పక్షంపైనా.. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిపైనా విమర్శలు సంధించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించేవారు. అయితే.. గడిచి న నెల రోజులుగా అంటే..కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. కనీసం మీడియా ముందుకు కూడా రాలేదు. ఎక్కడ ఉన్నారు.. ? అంటే.. ఇంటికే పరిమితమయ్యారనే మాట వినిపిస్తోంది. మరి ఎందుకు ఇలా జరిగింది? దీని వెనుక ఉన్న విషయం ఏంటి ? అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ, ఆ మంత్రి అవంతి శ్రీనివాస్.
విశాఖపట్నంలో తన పేరు నిత్యం వినిపించాలని తపించిన నాయకుడుగా అవంతి పేరు వినిపిస్తుంది. కీలక నేత, ప్రభుత్వంలో మంచి హవా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డికి పోటీగా.. అవంతి విశాఖలో చక్రం తిప్పారు. ప్రధానంగా విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత.. మరింత దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తన సత్తా చాటాలని ప్రయత్నిం చారు. కానీ, భీమిలి నియోజకవర్గం వరకే సాయిరెడ్డి పరిమితం చేశారు. కేవలం భీమిలి మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీని గెలిపించే బాధ్యతలు చూడాలని మౌఖికంగానే ఆదేశాలు ఇచ్చారు. దీంతో విశాఖ కార్పొరేషన్‌లో సాయిరెడ్డి అంతా తానై వ్యవహరించారు. అయినప్పటికీ.. అడపా దడపా.. మంత్రి అవంతి వేలు పెడుతూనే వచ్చారు.
తీరా.. ఇక్కడ.. ఆశించిన విధంగా వైసీపీ దూకుడు చూపించలేక పోయింది. భారీ స్థాయిలో 94 వార్డులకు 80 వరకు సాధిస్తామని ప్రకటనలు గుప్పించినా.. ఆమేరకు సత్తా చాటలేక పోయారు. చివరకు అవంతి కుమార్తె సైతం చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచారు. చివరకు భీమిలి నియోజకవర్గంలో కూడా వైసీపీ డీలా పడి… టీడీపీ సత్తా చాటింది. ఇక కార్పోరేషన్లో వైసీపీ గెలుపు మరి అంత వీజీ కాలేదు. ఇది ఒక విధంగా సాయిరెడ్డికే చెందుతుంది. కానీ,ఇప్పుడు ఆయన తప్పుకొని.. మంత్రి అవంతి వల్లే ఇదంతా జరిగిందని లోపాయికారీగా.. తన వర్గం వాళ్లతో ప్రచారం చేయిస్తున్నారట.
ఈ ఫలితాల ఎఫెక్ట్ నెల రోజులైనా జిల్లాను , పార్టీలోను విడిచి పెట్టడం లేదు. దీంతో అటు సాయిరెడ్డి, ఇటు మంత్రి అవంతి కూడా మొహం చూపించలేక పోతున్నారనే వాదన వినిపిస్తోంది. పైగా ఎన్నికల మూమెంట్‌లో విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న వారి పక్షాన నిలిచిన అవంతి.. ఇప్పుడు అటువైపు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఇక తన కుమార్తెకు డిప్యూటీ మేయర్ ఇప్పించుకోవాలని అవంతి కన్న కలలు నెరవేరలేదు. మరో నాలుగైదు నెలల్లో కేబినెట్ మార్పులు ఉన్న నేపథ్యంలో అవంతి ఎప్పటకి యాక్టివ్ అవుతారో ? చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 6:47 am
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…