తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం.. గెలిచి తీరుతాం.. అంటూ ప్రగల్భాలు పలికిన బీజేపీ నేతలు.. ఇప్పుడు అసలైన యుద్ధంలో అధికార పార్టీ వైసీపీ నుంచి అరాచకాలు జరుగుతున్నట్టు పెద్ద ఎత్తున మీడియాలో సాక్ష్యాలతో సహా గుట్టు బయట పెడుతుంటే.. ఒక్కరంటే ఒక్కరు కూడా కిమ్మనకుండా వ్యవహరిస్తుండడం రాజకీయంగానే కాకుండా.. సాధారణ పౌరుల మధ్య కూడా చర్చనీయాంశంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు.. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వందల కొద్దీ బస్సులు తిరుపతిపార్లమెంటు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికకు క్యూ కట్టాయి.
దాదాపు 250 బస్సులను తాము సీజ్ చేసి.. వెనక్కి పంపించామని.. సాక్షాత్తూ డీజీపీ గౌతం సవాంగే వెల్లడించారు. ఇక, పట్టుబడని బస్సులు.. పోలీసుల కన్నగప్పి.. తిరుపతికి చేరుకున్న బస్సుల సంఖ్య వీటికి రెండింతలు ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో దొంగ ఓటర్ల హవాను అరికట్టేందుకు.. ప్రతిపక్షం టీడీపీ జోరుగా రంగంలోకి దిగి ఎక్కక్కడ ప్రశ్నిస్తున్నారు. ఓటరు కార్డు ల్లోని పేర్లను ప్రశ్నిస్తూ.. దొంగ ఓటర్ల గుట్టును బట్టబయలు చేస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నిక బాధ్యతను కేంద్ర ఎన్నికల సంఘమే చూస్తోంది. ఈ క్రమంలో కేంద్రంలోని పెద్దలకు రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
అంతేకాదు.. పెద్ద ఎత్తున సాగిన దొంగ ఓట్ల తతంగానికి ఫుల్ స్టాప్ పెట్టేలా కూడా రాష్ట్ర బీజేపీ నేతలు చర్యలు తీసుకుని ఉండాల్సింది. కానీ, తిరుపతి బరిలో పోటీ చేస్తున్న రత్న ప్రభ తప్ప.. ఏ ఒక్కరూ స్పందించలేదు. కీలకమైన నాయకులు సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, జీవీఎల్ నరసింహారావు.. వంటివారు ఏమయ్యారు.? అనేది ప్రధాన ప్రశ్న. తాము ఎలాగూ.. గెలిచే పరిస్థితి లేదుకనుక.. వైసీపీకి సహకరిస్తే.. మున్ముందు.. ‘మేళ్లు’ జరుగుతాయని.. ఆశించారా? లేక.. ముందుగానే చేసుకున్న ఒప్పందం మేరకు మిలాఖత్ అయి.. సైలెంట్ అయ్యారా? అనేది ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తున్న వారి నుంచి ఎదురవుతున్న ప్రశ్న.
ఎక్కడైనా చిన్నతేడా వస్తే.. ఫలితం తారుమారు అవుతుందని.. పార్టీలు గగ్గోలు పెడుతుంటాయి. అయితే..నేరుగా వేలాది మందిని తరలించి.. దొంగ ఓట్లు వేయిస్తున్న వైనం.. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నా.. కమల నాథులకు చీమకుట్టినట్టుకూడా అనిపించకపోవడంపై సర్వత్రా విస్మయం.. అనుమానం కలుగుతున్నాయి. మరి ఏం చెబుతారో చూడాలి. చేతిలో కేంద్ర ప్రబుత్వాన్ని పెట్టుకుని.. ఇప్పుడు ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి లొంగిపోయారా? అనే సందేహాలు వ్యక్తమవుతుండడం గమనార్హం.
This post was last modified on April 17, 2021 7:55 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……