Political News

పెద్దిరెడ్డి క‌వ‌రింగ్‌: వాళ్లంతా టూరిస్టులేన‌ట‌

తిరుప‌తి పార్లమెంటు స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌స్తున్న దొంగ ఓట‌ర్ల హ‌వా ఎక్కువ‌గా ఉంది. ప‌ర్మినెంటుగా.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీ నేత‌లు వీరిని ప్రోత్స‌హించి.. తిరుప‌తికి పంపించి.. భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నార‌ని.. టీడీపీ ఆరోపిస్తోంది. ఈక్ర‌మంలో ఎన్న‌డూ లేనిది.. తిరుప‌తికి.. ఇత‌ర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున బ‌స్సులు క్యూక‌ట్టాయి. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఏ ఒక్క బ‌స్సూ.. ఆర్టీసీది కాదు. అన్నీ ప్రైవేటు టూరిస్టు బ‌స్సులే. ఈ బ‌స్సుల్లోంచి నేరుగా.. ఎన్నిక‌ల పోలింగ్ కేంద్రాల‌కు కూత‌వేటు దూరంలో దిగుతున్న యువ‌తీయువ‌కులు, మ‌హిళ‌లు.. నేరుగా.. కేంద్రాల్లోకి వెళ్తున్నారు.

అయితే.. ఈ విష‌యంలో అలెర్ట్ అయిన‌.. ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు.. దొంగ ఓట‌ర్ల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. వీరిని మీడియా ముందుకు తీసుకువ‌చ్చి.. ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. ఈ ఉదంతంపై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి హుటాహుటిన స్పందించారు. త‌న‌దైన శైలిలో .. క‌వ‌రింగ్ ఇచ్చారు. వాళ్లంతా టూరిస్టుల‌ని.. తిరుమ‌ల బాలాజీ ద‌ర్శ‌నం కోసం వ‌చ్చార‌ని.. దీనిని కూడా టీడీపీ రాజ‌కీయం చేస్తోంద‌నివిరుచుకుప‌డ్డారు. అంతేకాదు.. టీడీపీ ఓట‌మిని ఎదుర్కొనే స‌త్తాలేక‌.. ఇలా ఎదురు దాడి చేస్తూ.. శ్రీవారి భ‌క్తుల‌ను కూడా అవ‌మానిస్తోంద‌ని అన్నారు.

అయితే.. పెద్దిరెడ్డి చుట్టూ కొన్ని ప్ర‌శ్న‌లు స‌మాధానం లేకుండా ఉండ‌డం గ‌మ‌నార్హం. అవేంటంటే..

  • వ‌చ్చిన‌వారు శ్రీవారి భ‌క్తులే అయితే.. వారికి పోలింగ్ కేంద్రాల‌తో సంబంధం ఎందుకు?
  • బ‌స్సుల్లోంచి, జీపుల్లోంచి దిగుతున్న వారు టూరిస్టులే అయితే.. వారివ‌ద్ద క‌నీసం బ్యాగేజీ అయినా ఉండాలిగా? కానీ, ఏమీ లేదుగా!
  • టూరిస్టుల ద‌గ్గ‌ర ఓట‌రు కార్డులు ఎందుకు ఉన్నాయి? ఉంటాయి?
  • టూరిస్టులు అయితే.. వారి పిల్లా పాప‌లు ఎక్క‌డ‌? క‌నీసం ప‌ది మందిలో ఇద్ద‌రు ముగ్గురుకైనా.. పిల్ల‌లు ఉండ‌రా? తిరుమ‌ల క్షేత్రానికి వ‌చ్చేప్పుడు వారిని తీసుకురాకుండా ఉంటారా?
  • టూరిస్టులే అయితే.. మీడియా వెంట‌బ‌డిన‌ప్పుడు.. భ‌య‌ప‌డి పారిపోవ‌డం ఎందుకు?

.. ఇలా అనేక ప్ర‌శ్న‌లు స‌మాధానం లేనివిగా మిగిలిపోయాయంటే.. వీటికి మంత్రి పెద్దిరెడ్డి ఆన్స‌ర్ చేయ‌లేక‌పోయారంటే.. ఖ‌చ్చితంగా ఏదో మ‌త‌ల‌బు ఉంద‌నే విష‌యం స్ప‌ష్టం కావ‌డంలేదా? ఎంత క‌ల‌రింగ్ ఇచ్చినా.. దొంగ ఓట‌ర్ల‌ను ఆప‌డం సాధ్యం కావ‌డంలేదు.. అనే మాట‌.. వైసీపీలోనే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 17, 2021 2:31 pm

Share
Show comments

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

20 minutes ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

26 minutes ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

1 hour ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

1 hour ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

2 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

2 hours ago