Political News

జ‌గ‌న్ బాట‌లో టీడీపీ.. సోష‌ల్ ఇంజ‌నీరింగ్ త‌థ్యం..!


టీడీపీలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయ‌నే విష‌యాన్ని ఆ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సూచ‌న ప్రాయంగా చెప్పేశారు. త్వ‌ర‌లోనే అంటే.. తిరుప‌తి పార్ల‌మెంటుకు జ‌రుగుతున్న ఉప ఎన్నిక ముగియ‌గానే.. క‌ష్ట ప‌డుతున్న‌.. పార్టీ కోసం శ్ర‌మిస్తున్న వారిని వెతికి ప‌ట్టుకుని మ‌రీ.. ప్రాధాన్యం ఇస్తాన‌ని.. వారికి అండ‌గా ఉంటాన‌ని ఆయ‌న తాజాగా ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో ఒక్క‌సారిగా టీడీపీలో భారీ మార్పులు ఖాయ‌మ‌నే వాద‌న త‌మ్ముళ్ల‌లో చ‌ర్చ‌కు వ‌స్తోంది.

మ‌రి ఏం జ‌రుగుతుంది? నిజానికి 2019 ఎన్నిక‌ల్లో భారీ ఓట‌మి త‌ర్వాత టీడీపీలో పెను మార్పులు తీసుకు వ‌స్తానంటూ.. చంద్ర‌బాబు.. అనేక మందికి ప‌ద‌వులు ఇచ్చారు. పార్ల‌మెంట‌రీ స్థాయి ప‌ద‌వుల నుంచి మండ‌లాల వారీగా కూడా ప‌ద‌వులు కేటాయించారు. అంద‌రికీ ప‌ద‌వులు అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని ప్ర‌తి ఒక్క‌రికీ ప‌దవులు పంచారు. అయిన‌ప్ప‌టికీ.. తాజాగా జ‌రిగిన స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఓట‌మి పార్టీని పూర్తిగా డీలా ప‌డేలా చేసింది. ఈ ఎఫెక్ట్ తిరుప‌తిపై కూడా క‌నిపించింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో పార్టీని పున‌రుజ్జీవింపజేయాలంటే.. సీఎం జ‌గ‌న్ బాట‌లో న‌డ‌వ‌డం త‌ప్ప చంద్ర‌బాబు ముందు మ‌రో ఆప్ష‌న్ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ఇచ్చిన ప్రాధాన్యం గ‌మ‌నిస్తే.. పార్టీలో సీనియ‌ర్ల‌కే ఎక్కువ‌గా ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. వారంతా ఔట్ డేటెడ్ అయిపోయారు. ఎక్క‌డా కూడా కొత్త మొఖాలు క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వారు.. వ‌రుస‌గా ఓట‌ములు చ‌విచూస్తున్న‌వారికే ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. కానీ, వైసీపీని తీసుకుంటే.. నేత ఎవ‌ర‌నేది కాదు.. నాయ‌కుడిని బ‌ట్టి.. పార్టీ ఉంటుంద‌నే విష‌యాన్ని స్ప‌ష్టంగా చెబుతున్నారు.

ఇప్పుడు ఇదే సూత్రం ఆధారంగా పార్టీని బ‌లోపేతం చేయాలంటే.. ఎవ‌రు ఏ మూల జెండా ప‌ట్టుకున్నా.. అతి త‌క్కువ స‌మ‌యంలో ఆర్థిక‌, సామాజిక వ‌ర్గాల ఆధారంగా కాకుండా ప‌నితీరును బ‌ట్టి.. ప్రాధాన్యం ఉంటుంద‌నే సంకేతాలు పంపించ‌డం త‌క్ష‌ణావ‌స‌ర‌మ‌నే వాద‌న టీడీపీలోనూ వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ ఇంజ‌నీరింగ్ దిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నార‌ని.. ఇది తిరుప‌తి ఎన్నిక‌ల్లో వ‌చ్చే ఫ‌లితాన్ని బ‌ట్టి కొంత ఆధార‌ప‌డినా.. మొత్తంగా అయితే.. స‌మూల మార్పులు ఉంటాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on April 17, 2021 1:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉచితాల‌తో మ‌భ్య‌పెట్టాల‌ని చూశారు: వెంక‌య్య కామెంట్స్‌

మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి, బీజేపీ నాయ‌కుడు ముప్ప‌వ‌రపు వెంక‌య్య‌నాయుడు.. తాజాగా అటు తెలంగాణ‌, ఇటు ఏపీ నేత‌ల‌పై సెట‌ర్లు గుప్పించారు.…

26 minutes ago

టాక్ తేడాగా ఉన్నా కలెక్షన్లు అదిరిపోతున్నాయ్

కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…

1 hour ago

బాలయ్యకు ‘జాట్’ ఫార్ములా వద్దు

ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…

1 hour ago

అధికారికం… పాస్టర్ ప్రవీణ్ మరణం హత్య కాదు

ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…

2 hours ago

తెలివైన నిర్ణయం తీసుకున్న సారంగపాణి

ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…

4 hours ago

బాబు చేతులు మీదుగా అంగరంగ వైభవంగా కళ్యాణం

ఏపీలో రాముడి త‌ర‌హా రామ‌రాజ్యం తీసుకురావాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. రామ‌రాజ్యం అంటే.. ఏపీ స‌మ‌గ్ర అభివృద్ధి…

4 hours ago