మోడీ సుదీర్ఘ ప్రసంగం అనంతరం ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో చతికిల పడిన ఎకానమీని పరుగులు పెట్టించడానికి 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించారు ప్రధాని నరేంద్రమోడీ. ఈ సొమ్ము ఎంతో తెలుసా… 2020 బడ్జెట్లో సుమారు 70 శాతం. అయితే ప్యాకేజీలను ఇచ్చేటపుడు దానిని బడ్జెట్ తో కాకుండా దేశ జీడీపీతో పోలుస్తారు. ఎందుకంటే ఉద్దీపనలు ఇవ్వాల్సింది… మన జీడీపీని పెంచడానికే కాబట్టి జీడీపీతో పోలుస్తారు. అయితే ఆ పరంగా చూసినా కూడా చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద ఆర్థిక ప్యాకేజీని నరేంద్రమోడీ ప్రకటించారని చెప్పొచ్చు. గతంలో ప్రకటించిన 1.75 లక్ష కోట్లు, ఇపుడు ప్రకటించిన 20 లక్షల కోట్లు కలిపితే మన దేశ జీడీపీలో ఇది 11 శాతం.
ఇండియా సరే… ప్రపంచమంతటా దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్లో ఉన్నాయి. లాక్ డౌన్లో లేని దేశాల ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. మరి ఆయా దేశాలు ఎలాంటి ప్యాకేజీలను ప్రకటించాయన్న విషయాన్ని పరిశీలించినపుడు కూడా ఇండియా మంచి ప్యాకేజీ ఇచ్చినట్లే చెప్పాలి. కాకపోతే ఈ డబ్బును మార్కెట్లోకి తేవడంలో ఎలాంటి విధానాలు పాటిస్తారనేదే కీలకం. ఈ ప్యాకేజీలో ప్రకటించిన రూపాయ మార్కెట్లో క్యాష్ ఫ్లోగా మారితే దేశం కోలుకోవడం చాలా సులువు. ఈ డబ్బును మార్కెట్లోకి ఎలా తేవాలన్న దానిపై ప్రణాళిక తుదిరూపు దిద్దుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఏ ఏ దేశాలు ఎంత ప్యాకేజీ ప్రకటించాయో చూద్దామా?
జర్మనీ – జీడీలో 60 శాతం
ఇటలీ – జీడీపీలో 44 శాతం.
ఫ్రాన్స్ – జీడీపీలో 26 శాతం
యుకె – జీడీపీలో 21 శాతం
జపాన్ – జీడీపీలో 20 శాతం
స్పెయిన్ – జీడీపీలో 12 శాతం
సింగపూర్ – జీడీపీలో 12 శాతం
అమెరికా -జీడీపీలో 14 శాతం
ఇండియా – జీడీపీలో 11 శాతం
కెనడా – జీడీపీలో 8.4 శాతం
హాంకాంగ్, తైవాన్ – 5.5, 5.3 శాతం
This post was last modified on May 13, 2020 12:49 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…