వైసీపీ అధినేత జగన్‌కు కంటిపై కునుకులేకుండా చేస్తున్న అదే పార్టీ రెబల్ ఎంపీ.. కనుమూరి రఘురామ కృష్ణరాజు.. ఒకవైపు తన వ్యాఖ్యలతోను, మరోవైపు చర్యలతోనూ పార్టీ నేతలు ఉలిక్కిపడేలా చేస్తున్నారు. ఎక్కడ… ఎందుకు.. ఎలా.. మొదలైందో తెలియదు కానీ.. చిలికి చిలికి గాలివానగా మారిన.. ఈ వివాదంలో రఘురామరాజు తనదైన స్టయిల్‌లో దూకుడుగా వెళ్తూ.. వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఏకంగా సీబీఐ కోర్టులోనే పిటిషన్ వేయడం.. దానిని కోర్టు విచారణకు తీసుకోవడం అత్యంత కీలక పరిణామంగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇక, దీని నుంచే సీఎం జగన్ ఎలా బయట పడాలా? అని ఆలోచిస్తున్న సమయంలో మరో సారి రఘురామ రాజు జగన్ పరువును ఢిల్లీకి ఈడ్చేశారు. రెండు రోజుల కిందట సీఎం జగన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్ ఎస్‌లను తన గుప్పిటలో పెట్టుకునేలా.. ఆయన వ్యూహం రచించుకున్నారు. వారికి ప్రమోషన్ ఇవ్వాలన్నా.. వారిని బదిలీ చేయాలన్నా.. ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారం ఉండేది. జిల్లాల్లో పనిచేస్తున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల పనితీరును మదింపు చేయడం.. వారికి ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడం వంటివి.. సీఎస్ చేస్తున్నారు.
అయితే.. ఇప్పుడు ఈ అధికారాన్ని సీఎం జగన్ తన చేతుల్లోకి తీసుకున్నారు. కానీ, ఇది వివాదాస్పద నిర్ణయం. ఎందుకంటే.. రాష్ట్రాల్లో పనిచేస్తున్నప్పటికీ.. ఐఏఎస్‌లు, ఐపీఎస్ లను నేరుగా రాష్ట్రపతి నియమిస్తారు. వారి పనితీరును సీఎస్ ముందుగా మదింపు చేసి.. కేంద్రంలోని సిబ్బంది వ్యవహారాల శాఖకు పంపిస్తారు. దీనివల్ల పారదర్శకత ఉంటుందనేది కేంద్రం చెప్పేమాట. అయితే.. ఇప్పుడు ఈ అధికారాన్ని సీఎం జగన్ తనే తీసుకున్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల పనితీరును తనే మదింపు చేస్తానని.. వారి వార్షిక పనితీరుకు సంబందించిన నివేదికలు తనకే ఇవ్వాలని ఆయన ఆదేశించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి.
ఈ విషయం సరికాదని తెలిసినప్పటికీ.. ఎవరూ మాట్లాడడం లేదు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణరాజు.. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఏపీ కేడర్ ఐఏఎస్‌ల వార్షిక నివేదిక ఆమోదం సీఎం చేతుల్లో పెట్టడంపై ఫిర్యాదు చేశారు. ఐఏఎస్‌ల భవితవ్యం సీఎంగా ఉండే రాజకీయ నేతకు ఎలా అప్పగిస్తారని ఎంపీ ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజాయితీపరులైన అధికారులకు అన్యాయం చేసే అవకాశముందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ జీవోపై జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on April 16, 2021 8:03 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…