Political News

చంద్రబాబులో జోష్ నింపిన ఉపఎన్నిక ?

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారు ? నిజానికి ఇది చాలా సింపుల్ ప్రశ్నే. రాజకీయంగా ఏమాత్రం అవగాహన ఉన్న వారైనా వైసీపీనే గెలుస్తుందని ఠక్కున సమాధానం చెప్పేస్తారు. అయితే ఇదే ఉపఎన్నిక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడులో కూడా ఓ విధంగా జోష్ నింపిందనే చెప్పుకోవాలి. ఉపఎన్నికలో వైసీపీ గెలిస్తే ఓడిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబులో జోష్ ఎలా వస్తుంది ?

ఎలా వస్తుందంటే ఉపఎన్నికకు ముందు టీడీపీ పూర్తిగా నిస్తేజమైపోయింది. పంచాయితి, మున్సిపల్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బల ఫలితంగా పార్టీ నేతల్లో బాగా నైరాస్యం పెరిగిపోయింది. టీడీపీ పనైపోయిందనే ప్రచారం పార్టీలోనే పెరిగిపోతోంది. ఇదే సమయంలో తెలంగాణాలో పార్టీ తరపున ఉన్న ఇద్దరు ఎంఎల్ఏలు అధికారికంగా టీఆర్ఎస్ లో చేరిపోయారు. వాళ్ళు చేరటమే కాకుండా టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో కలిపేశారు. దాంతో తెలంగాణాలో పార్టీ జెండా ఎత్తేసినట్లయ్యింది.

ఒకవైపు పార్టీపై దెబ్బమీద దెబ్బ పడుతున్న సమయంలోనే చంద్రబాబు తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలోకి దిగారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి 4.94 లక్షల ఓట్లు వచ్చాయి. ఇపుడు  ఆ ఓట్లు తెచ్చుకుంటే అదే మహా భాగ్యమన్నట్లుగా ఉంది పరిస్ధితి. అయితే ఆ ఓట్లు తెచ్చుకుంటుందా లేదా అన్నది పక్కన పెట్టేద్దాం. చంద్రబాబు ప్రచారం చేసిన వెంకటగిరి, శ్రీకాళహస్తి, గూడూరు నియోజకవర్గాల్లో జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు.

వచ్చిన వాళ్ళంతా ఓట్లేస్తారా లేదా అన్నది పక్కన పెట్టేస్తే చంద్రబాబు పర్యటనకు జనాలు బాగా స్పందించటమే ముఖ్యం. ప్రచారంలో ఎంత రాత్రయినా జనాలు ఓపిగ్గా వెయిట్ చేయటం చంద్రబాబులో జోష్ నింపిందనటంలో సందేహంలేదు. ఇపుడు ప్రచారంలో జనాల స్పందన గనుక లేకపోయుంటే చంద్రబాబు సంగతి ఎలాగున్నా నేతలు మాత్రం పూర్తిగా నీరసపడిపోయుంటారనటంలో సందేహంలేదు. గెలుపోటములను పక్కనపెట్టేస్తే చంద్రబాబు పర్యటనకు జనాల్లో  విశేష స్పందన కనిపించటం పార్టీలో మంచి జోష్ నింపిందనే చెప్పాలి. 

This post was last modified on April 13, 2021 12:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago